పుట:Bala Neethi.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

95

బా ల నీ తి.

బూర్వులలోగొందఱు కలరు. వారిలో నొకరిని జూపించు చున్నాను.

    మున్ను మహిష్మతీపురంబున గార్తవీర్యార్జును డనువాడు దత్తాత్రేయానుగ్రహంబున సకలసంపదలు బొంది సుఖముగా సహస్రబాహువుల రాజ్యము బరిపాలించు చుండెను. అతడితరరాజులను దనకు గప్పముగట్టువారలనుగా జేసికొని తనయాజ్ఞకు నందఱిని లోబఱచుకొను చుండెను. ఆసమయమున దనకత్తికెదురకత్తి లేకయుండెను. అందువలన నాకార్త వీర్యార్జునుడు నాతో సమానుడగు పరాక్రమశాలి యీలోకమున లేడని గర్వించి యధేచ్చముగా నుండెను. అట్టితఱి రావణాసురుడు దిగ్విజయార్దం బీరాజుసమీపమునకుగూడ వచ్చెను. అంత నీయర్జును డారావణుని బాధించి తనచెఱసాలలో గొన్నిదినము లుంచి జాగ్రత్తగా నుండుమని బుద్దిజెప్పి చెఱసాలనుండి విడుదలజేసి పంపించివేసెను. వీనిని జయించుటవలన గర్వమదికమాయెను. అంత నొక సమయమున నీయర్జునుడు జమదగ్నియాశ్రమము నకు జనెను. అంత నాజమదగ్ని యతిదిగావచ్చిన యారాజును సత్కరించి యారగింపజేసెను. అంత నారాజాయన్నమునుగుడిచి కూర్చుండి యిదివఱకా హోమదేనువుచేసిన పని కత్యాశ్చరమందుచు దానినపహరింపనెంది "దీనినింటికి దీసికొనివెళ్ళు" డని తనసేవకుల కాజ్ఞనొసంగెను. అంత నారాజభటులు