పుట:Bala Neethi.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
92

బా ల నీ తి.

రోచనుడు పెట్టకమునుపె తానగ్గి నాయింటికంటించి వారిని దగ్దులనుగా నొనరించి మాతృసోదరసమేతముగా సుఖముగా నొకచోజేరెనుగదా. ప్రస్తుతము దురాశవలన బెడిసినదెవరు? దుర్యోధనుడేగదా. ఈతడుతన్ను గట్ట ద్రాళ్ళు తానెతెచ్చుకొనెనుగదా. వీని కీదురాశయె లేని యెడల బాగుపడునుగదా. కాబట్టి దురాశ గలిగించ్వరలు దు:ఖభాగులగుదురు. కావున మనము దురాశవిడనాడి తరినయాశ కలిగియుంది సత్కార్యము ల జేయుచుందము.

క. అది సర్వదోషముల కా
    స్పద మది దురితక్రియాను♦బంధంబులకున్
    మొదలు నిరంతర దు:ఖ
    ప్రదమని మదిదలచి తృష్ణ♦బాతురు సుమతుల్
 

(భారతము)

                ---

అ హం కా ర ము.

     నేనేశ్రేష్ఠుడననుబుద్ధిని జనింప జేయునది యహంకారమనబడును.
    ఇది, తన మాట కెదురు మాటాడక యుండునపుడును లోకము తాజెప్పుదానిని విశ్వసించి యాచరించుసమయమునందును, మఱియు నొక చిషయమున దానధికుడని జనులచే బొగడ్తజెందినపుడును జనించుచుండును.