పుట:Baarishhtaru paarvatiisham.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ అభిప్రాయం తెలియపరచవచ్చునని నాపుస్తకకానికి ప్రవేశిక నేనే వ్రాసుకుంటున్నాను.

ప్రపంచములో నూతనోద్యమము ఏది బయలుదేరి నప్పటికిన్ని అది లేత మనస్సులను ఆకర్షించి యువకులకు ఉత్సాహము కల్పించి కార్యరంగములోనికి దిపుతుంది. ఉత్సాహమే కాని వెనకా ముందూ ఈషణ్మాత్రమైనా గమనింతామనే సంగతి వాళ్ళకు తట్టదు. అందులో స్వాతంత్ర్యము లేని దేశములో తక్షణము స్వరాజ్యము సంపాదింతామనే ఆదుర్దాచేత ప్రారంభమంటూ ఒకటి ఉంటుందనే సంగతి మరిచిపోయి కొనాకులు మేస్తారు. ఆంధ్రు లదివర కెలా ఉండేవారో తెలియదుకాని ఆంధ్రోద్యమ మంటూ బయలు దేరినప్పటి నించీ ఆంధ్ర వ్యక్తిత్వము అంటూ ఒక చిత్రమైన ప్రకృతి బయలుదేరింది. ఇది ముఖ్యంగా యువకులైన వాళ్ళలో మూర్తీభవించింది. ఆ స్వరూపమే మన పార్వతీశము. కుర్రవాడు, అల్పజ్ఞుడు, దేశములో స్థితిగతులు ఉండవలసినరీతిగా లేవనీ, ఏదో మార్పుమట్టుకు అవసరమనీ తెలుసుకున్నాడు. ఏమి చేయాలో అతని అల్పబుద్ధికి గోచరించలేదు. అలా అని అంతటితోటి విడిచిపెట్ట లేదు. దాని విషయము పూర్తిగా ఇంకొకళ్ళను అడిగి తెలుసుకోడము న్యూనత అనుకొన్నాడు. మహామహులు నిర్వహించలేని కార్యము తను ఒక్కడే కొనసాగిస్తాననుకున్నాడు. తనీ ప్రయత్నము చేయకపోతే ఇక హిందూ దేశానికి ముక్తి లేదనుకున్నాడు.

ఒక విషయము చెప్పడానికి చెప్పే పద్ధతు లనేకములుంటయి. అందులో అందరికీ నచ్చేది హాస్యరీతి. అది ఎంత