పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 16

కర -- ఆపళ్ళు యికిలించడమా?

రామా -- ఆ కళ్ళ అందము కనిపెట్టినావా?

కర -- చికిలికళ్ళ-

రామా -- నీవంటి గుడ్డివాళ్ళ కాలాగే కనుపడతవికాని మా వంటి రసికులకు-

కర -- (తనలో) ఈవ్యవహారంయింకా రెండు నిముషాలు యిలాగు జరుగుతూవుంటే నాకునిజంగానే పిచ్చియెత్తుతుంది.

రామా -- ఓమోహినీ! నీకు ప్రియులెందరున్నారు?

మోహి -- ఒక్కడే.

రామా -- ఒక్కడేనా? అతడుమిక్కిలిచక్కనివాడుకాబోలును.

మోహి -- ఆరంభంలో ఆలాగేకనుపడుతాడుగాని తరువాత ఏమయినాఅంటే అతడు వంటిరిగా వున్నప్పుడు నన్నుకొడతాడేమో అని భయము వేస్తూవున్నది.

రామా -- అతనికి నీమీద అనుమానంకూడా వున్నదా?

మోహి -- యిప్పటిస్థితిచూస్తే అదికూడావున్నట్టే కనుపడుతూవున్నది.

కర -- ఇప్పుడువెళ్ళి - (అని కాలు నేలతన్ను చున్నాఁడు.)

రామా -- అదేమిటి?

కర -- ఏమీలేదు. కాలుతిమ్మిరిగా వున్నది. (తనలో) ఇక నిజంచెప్పివేస్తాను.

రామా -- వక్క కాలేకాదు నీకువళ్ళంతా తిమ్మిరిగావున్నట్టున్నది.

[అప్పుడు వెంకఁడు పరుగెత్తుకొని వచ్చుచున్నాఁడు.]

వెంక -- అయ్యా! అమ్మగారు వస్తూవున్నారు.

రామా -- యేఅమ్మగారు రా?