Jump to content

పుట:AntuVyadhulu.djvu/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

ఏడవ ప్రకరణము


కంపముజెందును. ఇదేప్రకారము కొన్ని జంతువులను లెక్క లేకుండ నశింపజేయు కొన్ని అంటువ్యాధులు ఇతర జంతువులకు అంటనే అంటవు. మహామారి (Plague) వ్యాధివలన ఎలుకలు కుప్పలు కుప్పలుగ చచ్చును. అదే ప్రదేశములయందుండి వీరితో సాంగత్యము కలిగియున్నను పందికొక్కులకు ఎంతమాత్రము భయములేదు. వృక్షజాతియందుకూడ ఆముదపు చెట్టునకు అంటుచీడ యదే ప్రదేశములోనుండు ఇతర జాతివృక్షములకంటునా?

ఇట్టి జాతి భేధములు దేశ భేదములేగాక వయస్సును బట్టియు భోజనాది సౌకర్యములనుబట్టియు ఇంక నితర కారణములనుబట్టియు అంటు వ్యాధుల వ్యాప్తిమారుచుండును. పసి వాండ్రకు అంటువ్యాధులు సులభముగ నంటును. మిక్కిలి వయస్సువచ్చిన పావురములకంటె చిన్నపావురములకు దొమ్మ వ్యాధి సులభముగ అంటునని శోధకులు పరీక్షించియున్నారు. ఇదిగాక ఆకలిచేగాని బడలికచేగాని బాధనొందు జంతువులకీ యంటువ్యాధులు మిక్కిలి శీఘ్రముగ నంటుననియు; అధికముగ నీటిలో నానినప్పుడును అతిదాహముగ నుండునప్పుడును ఈ వ్యాధులు సులభముగ అంటుననియు కుక్కలు కోళ్లు మొదలగు జంతువులమీద పరీక్షించి అనేకమంది విద్వాంసులు నిర్ధారణ జేసియున్నారు.

మానవులలో కూడ యొకానొకప్పుడు సూక్ష్మజీవుల కసాధ్యముగా నుండువారి శరీరము సయితము అధికాయాస