పుట:AntuVyadhulu.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మజీవుల ఆయుర్దాయము

67


వచ్చును. దొమ్మును కలిగించు సూక్ష్మజీవులు నెత్తురుగుండను, ధనుర్వాయువు కలిగించు సూక్ష్మజీవుల విషములు నరముల గుండను వ్యాపించును.

ఒకానొక వ్యాధి ప్రారంభమైన తరువాత సూక్ష్మజీవు లెల్ల తమసైన్యములను, విషములను నలుదిక్కులకు ఎట్లు ప్రసరింప జేయుచుండునో అట్లే మన శరీరమందలి వివిధాంగములును సూక్ష్మజీవుల కపాయకరములగు వివిధ పదార్థములను పుట్టించుచు తమ యుద్ధభటులను వృద్ధిచేసికొనుచుండును. మన శరీరబలము సూక్ష్మజీవుల బలముకంటె మించినయెడల వ్యాధి కుదురును. లేదా వ్యాధి ప్రకోపించును. అతిమూత్రము మొదలగు కారణములచే శరీరబలము తగ్గియున్న వార లిందుచేతనే రాచపుండు మొదలగువానికి సులభముగ లోబడుదురు.

సూక్ష్మజీవుల ఆయుర్దాయము

తల్లి సూక్ష్మజీవియే రెండు ముక్కలయి యందు ప్రతి ముక్కయు తిరిగి యౌవనముగల సూక్ష్మజీవి యగుటచేత తల్లి కెన్నటికిని మరణమున్నదని చెప్పుటకు వీలులేదు. కావున సాధరణముగా సూక్ష్మజీవులన్నియు చిరంజీవులనిచెప్పనగును. కాని యొక చెరువు ఎండిపోయినప్పుడా చెరువులోని చేపలన్నియు నెట్లు చచ్చిపోవునో అట్లే యొకరోగి మృతినొందినప్పుడు ఆ రోగి నాశ్రయించియున్న సూక్ష్మజీవు లనేకములు వానికి