Jump to content

పుట:AntuVyadhulu.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

నాల్గవ ప్రకరణము


పుట్టించు న్యూమోనియా (Pneumonia) జ్వరము కూడ ఇట్లే ప్రవేశించుచున్నది.

దగ్గు పడిశము, కండలలోనూ కీళ్ళలోను నొప్పులు మొదలగువానితో కూడివచ్చు ఇంప్లూయంజా, డింగూ యను జ్వరములును ఆయా జాతి సూక్ష్మజీవులను మనము ఆఘ్రాణించుటచేతనే కలుగుచున్నవి. కలరా, సన్నిపాతజ్వరము, ఇవి యెన్నడో కాని, గాలిమూలమున వచ్చినట్లు కాన రాదు. ఇంతవరకు చలిజ్వరముకూడ మన్యపు గాలిని పీల్చుట వలన వచ్చునని తలచిరిగాని ఈవ్యాధిదోమకాటు మూలమున వ్యాపకమగుచున్నదని ఇప్పుడందరి వైద్యులకు నమ్మకము.

౪. మ్రింగుట

కలరా, సన్ని పాతజ్వరము, (౨౮ దినముల జ్వరము) రక్తగ్రహిణి, ఇవి మనముతిను ఆహారమునందును నీరునందును గల సూక్ష్మజీవులచే కలుగుచున్నవని చెప్పవచ్చును. అతిసార విరేచనములలోగూడ కొన్ని జాతులు ఆహారములోని సూక్ష్మజీవుల కారణముననే కలుగుచున్నవి. రోగులను తాకిన చేతులలో అన్నము తినుటచేతగాని, రోగుల మలమూత్రములతో కల్మషమైన చెరువులలోని నీటిని త్రాగుటచేత గాని ఈ వ్యాధులు వ్యాపించుచున్నవి. క్షయవ్యాధిగల ఆవులపాల గుండ చిన్నబిడ్డల కా క్షయవ్యాధి అంటుచుండును. దీనివలన