Jump to content

పుట:AntuVyadhulu.djvu/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పలుచని పొరలగుండ ఊరుట

49


గలుగుచున్నది. కురుపులలో చీము పుట్టించు సూక్ష్మజీవులు తరుచుగా గాయముల మూలముననే మన శరీరములో ప్రవేశించును.

౨. పలుచని పొరలగుండ ఊరుట

పైనిచెప్పిన పచ్చసెగ మొదలగు సుఖవ్యాధులు ఒకా నొకప్పుడు రోగుల అంగములమీద గాయములు లేకపోయినను ఆ యంగముల పైనుండు మృదువైన పలుచని పొరగుండ శరీరములోనికి సూక్ష్మజీవులు ఊరుటవలన కలుగవచ్చును. చీము పుట్టించు సూక్ష్మజీవులు గర్భకుహరములోనికి ప్రవేశించి నెత్తురులోనికి చేరుటచేతనే ప్రసవమైన స్త్రీలకు సూతిక జ్వరము గలుగుచున్నది. ఇదే ప్రకారము కన్నుల నావరించి యుండు పలుచని సూక్ష్మజీవులు ప్రవేశించి యవి కంటి నాశ్రయించి యుండుటచే కండ్లకలక కలుగుచున్నది. ముక్కులోని పొరను సూక్ష్మజీవులంటినపుడు పడిశమును, గొంతుకలోని గాని ఊపిరితిత్తులలోనిగాని పొరలను సూక్ష్మజీవు లంటినపుడు దగ్గును కఫమును కలుగుచున్నవి.

౩. ఊపిరితో పీల్చుట

ఆటలమ్మ, మశూచకము, వేపపువ్వు లేక చిన్నమ్మ, గవదలు, కోరింత దగ్గు, ఈ వ్యాధులు గాలితో పాటు ఆయా జాతుల సూక్ష్మజీవులను పీల్చుట చేతనే కలుగుచున్నవనుటకు సందేహము లేదు. ఊపిరితిత్తుల వాపును కఫమును

4