పుట:AntuVyadhulu.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మజీవుల కనుకూలమగు స్థితిగతులు

41


ఈ మధుశిలీంధములు చక్కెరను సారాయిగను బొగ్గు పులుసు గాలిగను మార్చును. బాక్టీరియములుకూడ తాము నివసించు పదార్థములలో ననేక మార్పులను కలుగ జేయును. ఇట్లె చీము పుట్టించు సూక్ష్మ జీవులు తమ చుట్టు ప్రక్కలనుండు కండ మొదలగు పదార్థములను కరగించి ద్రువరూపముగ జేసివేయును. మరికొన్ని సూక్ష్మ జీవులు కొన్ని విషపదార్థములను వెలిపరుచును. ఈ విషపదార్థములు కొన్ని సూక్ష్మజీవులనుండి పుట్టినవి పుట్టినచోటనే నిలిచి యుండును. మరికొన్నిటినుండి పుట్టు విషపదార్థములు శరీరమునందలి ద్రవపదార్థములగుండగాని, నరములగుండగానీ వ్యాపించును. ఇట్లే క్షయజాతి సూక్ష్మజీవుల విషము చాలా భాగము పుట్టినచోటనే యుండును. “టిటనస్” (Titanus) ధనుర్వాయు సూక్ష్మజీవులు మొదలగువాని విషము శరీర మెల్లెడలకు వ్యాపించును. కొన్ని సూక్ష్మజీవులు ప్రాణవాయు వేవైపుననుండిన ఆవైపునకు చలించును. మరికొన్ని సూక్ష్మ జీవులకు గాలితగిలినతోడనే చలనముపోవును. సామాన్యముగ అనేక సూక్ష్మజీవులు కొంతవేడిని భరించి ఆ వేడియందు మిక్కిలి శీఘ్రముగ వృద్ధిబొందును. అంతకంటె హెచ్చగు వేడిమియుండినయెడల చురుకుతనము తగ్గి క్రమముగ నశించును. కాన ఎంతవేడిమి తమవృద్ధికి మిక్కిలి అనుకూలముగ నుండునో అంతటి శరీరపు వేడిమిగల జంతువులలోనే ఆయాజాతిసూక్ష్మ