పుట:AntuVyadhulu.djvu/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

మూడవ ప్రకరణము


చూపినట్లు కొన్ని మొక్కల వేళ్లను ఆశ్రయించియుండి గాలి నుండి నత్రజనిని తీసికొనును. అనేక బాక్టీరియములు పులిసిన ద్రావకములలో చచ్చును. కాని పైని చెప్పిన శిలీంధ జాతి లోని సూక్ష్మజీవులు వీనికి ప్రతిగా పులిసిన పదార్థములలో హెచ్చుగ పెరుగును. కలరా సూక్ష్మజీవి పుల్లని చల్లలో చచ్చును. పాలను చల్లజేయు సూక్ష్మజీవులు చల్ల పులిసిన కొలదిని హెచ్చుగ వృద్ధిజెందును. వీనిని మధుశిలీంధములందము, 21-వ పటము చూడుము. మినపపిండి మొదలగుపదార్థములు పులియుటకు సహకారులగు సూక్ష్మజీవులు శిలీంధముల జాతిలోనివే.

21-వ పటము

మధుశిలీంధములు (Yeast)

మినపపిండిని పులియబెట్టునట్టియు; కల్లును, చెరకు పానకమును సారాయిజేయునట్టియు శిలీంధములు.

అ—ఇందు ఇవి 250 రెట్లు చూపబడినవి.
ఇ—ఇందు 1500 ల రెట్లు చూపబడినవి. కణమునందు అక్కడక్కడ మొటిమలు (మొ) పుట్టి యవి తెగిపోయి క్రొత్త శీలీంధములు అగును.
ఉ—ఇందు మొటిమలకు పిల్ల మొటిమలు పుట్టి గొలుసుగా నేర్పడుచున్నవి.