పుట:AntuVyadhulu.djvu/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాక్టీరియములు

35

సూక్ష్మజీవులు రూళ్ళ కర్రముక్కలవలెనుండును. కలరాను, కొఱుకు వ్యాధిని పుట్టించు సూక్ష్మజీవులు మరమేకులవలె మెలిదిరిగియుండును. ఈ బాక్టీరియములలో అనేక జాతులను గూర్చియు ఇతర విషయములను గూర్చియు ఇచ్చట వివరింప నెడము చాలదు.

16-వ పటము

బాక్టీరియము లనేకములు తోకలుకలిగి చురుకుగ చలించుచుండును 16-వ పటము చూడుము. మరికొన్నితోకలులేక యంతగా కదలలేక యుండును. ఈ కవచముయొక్క సహాయముచే నెంత యెండకును వేడికిని లెక్కచేయక చిరకాలము నిద్రావస్థలో నున్నట్టులుండి తరుణము వచ్చినపుడు తమ కవచమును విడిచి చురుకుగల బాక్టీరియములగును. ధాన్యపు గింజలు అయిదారు నెలలవరకు కళ్ళములందలి నెర సందులలో పడియుండి వర్షకాలము రాగానే మొలచుటకు సిద్ధముగ నున్నట్లే యివియును వానికి తగిన స్థలమును ఆహారాదులును దొరకినప్పుడు తిరిగి మొలచును. ఇట్లే పశువుల దొమ్మ, కలరా మొదలగు సూక్ష్మజీవుల గ్రుడ్లును తమ వృద్ధికి