పుట:AntuVyadhulu.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

మూడవ ప్రకరణము


౩. బాక్టీరియములు (Bacteria)

మనకు తెలిసిన సూక్ష్మజీవులలో బాక్టీరియములు మిక్కిలి అధిక సంఖ్యగలవి. ఇందు అనేక జాతులును ఉపజాతులునుకలవు. ఇవి సాధారణముగ వృక్షజాతి లోనివి. ఇవియే మిక్కిలి సూక్ష్మమయినట్టి వృక్షములని చెప్పవచ్చును. వీనిని ఒక అంగుళము పొడుగునకు 8-వేలు మొదలు 75-వేలవరకు ఇముడ్చవచ్చును. ఇవి చుక్కలవలెను కణికలవలెను గుండ్రముగాగాని, మరమేకులవలె మెలిదిరిగిగాని యుండవచ్చును. మూడవ పటములో కనుపరిచిన జలదారినీటిలోని 1,2,3,4, అంకెలుగల చోట్లచూడుము. ఇవి యొకటొకటి కొంతవరకు పెరిగిన వెంటనే రెండు ముక్కలుగా విరిగి ప్రతిముక్కయు తిరిగి తల్లి సూక్ష్మజీవియగుటచే సంతానవృద్ధియగును. క్రింది పటము చూడుము. చీమును పుట్టించు సూక్ష్మజీవులు చుక్క వలె నుండును. పచ్చశగను పుట్టించు సూక్ష్మజీవులు

14-వ పటము.

జీడిగింజలవలెనుండి జంటలు జంటలుగా నుండును. 15-వ పటము చూడుము. క్షయను బుట్టించు సూక్ష్మజీవులు కొంచెము వంగిన కణికలవలె నుండును. దొమ్మను పుట్టించు