పుట:AntuVyadhulu.djvu/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

మూడవ ప్రకరణము

Phytic Nutrition) అనగా మురికి వీని తిండి. వీనికి శిలీంధములు (Fungi) అని పేరు. శిలీంధమనగా కుక్కగొడుగు.

౩. మఱి కొన్ని జాతుల సూక్ష్మజీవులు వృక్షముల వంటివి. ఇవిమనకంటి కగపడకపోయినను, ఆకుపచ్చగ నుండకపోయినను, చెట్లవలె బొగ్గుపులుసు గాలిని బొగ్గుక్రిందను, ప్రాణవాయువుక్రిందను విడదీసి, బొగ్గును తమ శరీరపుష్టికొర కుపయోగించుకొని ప్రాణవాయువును విడచివేయును. వీని యాహారము కేవలం వృక్షాహారము (Holophytic Nutrition).

కాని కొన్ని సూక్ష్మజీవులు కొంతయాహారమును జంతువులవలెను, కొంత యాహారమును వృక్షములవలెను, మరికొంత యాహారమును కుక్క గొడుగులవలెను కూడితినును. ఇట్టివాని యాహారము మిశ్రమాహారమని చెప్పవచ్చును. ఇట్టి వానికి బాక్టీరియములు (Bacteria) అని పేరు.

సూక్ష్మ జీవులలో ౧. సూక్ష్మ జంతువులు (Protozoa) ౨.శిలీంధములు (Fungi) ౩. బాక్టీరయములు (Bacteria) అను నీ మూడు ముఖ్య విభాగములను గూర్చి కొంతవరకు మనము తెలిసికొనవలెను.

౧. సూక్ష్మజంతువులు (Protozoa)

సూక్ష్మజంతువులనగా మిక్కిలిక్రిందితరగతి జంతువులు. సాధారణముగ ఇవి ఏకకణ ప్రాణులు. అనగా వీని శరీరమంతయు ఒక్కటె కణముగానుండును. ఇందు చుట్టునుండు