పుట:AntuVyadhulu.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరసందు

17

ఈ మూలను ఆ మూలనుండు ఎలుక కన్నములమాట చెప్పనక్కరలేదు. రెండువైపులు పోగా మూడవవైపున పొయిలును, పదినాళ్ళుసున్నమువేసినను దానినంతయు మ్రింగివేయు మసిగోడయును ఉండును. ఈ ప్రక్కనే ఒకటిరెండు వారములకు కావలసిన పిడకలు పుల్లలు ఒక మూలను, గడచిన దినమునాటిబూడిద బొగ్గులు మరియొక మూలను ఉండును. ఇక నాలుగవతట్టున గడ మంచెమీద బియ్యపుగంప లేక గంగాళమును, ఊరగాయలకుండలును, పప్పుప్పులును విస్తరాకులును, ఉండును. గడమంచెక్రింద చిల్లులుపడ్డ పాత్ర సామానులు, దినదినము ఉపయోగము లేని బలువైన పాత్రలు మొదలుగునవి ఉండును. వీనిచాటునపడియుండు పప్పుగింజలను ఏరుకొనుటకు జేరెడి పందికొక్కులకును ఎలుకలను మసలుటకు సందిచ్చి ఇవిమిక్కిలి సహ కారులగును. కొంచెము బద్ధకముగా నున్నప్పుడు కూరగాయల తొక్కలును మిరపకాయల తొడిమలను ఇంటివారలూడ్చివేయుట కీ సందు లనుకూలపడును.

వరసందు

ఇంతట వంటయిల్లు విడచి, దానిప్రక్కను చేతులు కడుగుకొనుటకును, గంజి పారబోసికొనుటకును ఉపయోగపడు చిన్నసందులోనికి పోవుదము. ఈ సందును కొందరు మడిసందనియు మరికొందరు వరసందనియు చెప్పుదురు. సామాన్యముగా ఈసందులోనికి వంటయింటిలోనుండియే

2