పుట:AntuVyadhulu.djvu/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

పుట్టుట గలదు. ఒక్కొకప్పుడు ఈ కురుపులలో చీము పట్టి ఆ యా భాగములు చచ్చి పోయి కాళ్లు చేతులు తెగ గొట్ట వలసి వచ్చును. ఒక్కొకప్పుడు ప్రాణ హాని కూడ కలుగ వచ్చును. ముఖ్యముగ అతి మూత్ర వ్యాధి కలవారలు ఈ పురుగు అంటిన ఎడల మిక్కిలి అపాయకర మగును. కాళ్లు చేతులు, క్రుళ్లి చచ్చి పోవును. బల వంతముగ లాగి నారిని త్రెంపిన యెడల పిల్లలన్నియు చెదరి పోయి జ్వరము, అధికమైన బాధ మొదలగు చిహ్నములతో పెద్ద కురుపేర్పడి హెచ్చుగ పీడింప వచ్చును. ఒకానొకప్పుడు పురుగు చర్మము పైకి తేలక మునుపే తనంతట కానే చచ్చి పోవచ్చును. అట్టి సమయములలో అది లోపల మిగిలి పోయినను అపాయము లేదు.

నారి కురుపు వచ్చిన వారలకు సాధారణముగా చికిత్స అక్కర లేకయే పురుగు బయట పడి మాని పోవచ్చును. కాని అప్పుడప్పుడు చన్నీళ్లతో తడిపిన పరిశుబ్రమైన మెత్తని గుడ్డను పుండు మీద వేసి దాని పైని లేత అరిటాకు గాని, మెత్తని ఎండు తామరాకును గాని వేసి కట్టి తడి గుడ్డ ఆరిపోకుండ మార్చు చుండుట మంచిది. ఇట్లు చేయుచు కొద్ది కొద్దిగ నారిని బయటకు లాగిన యెడల పురుగు అంతయు శీఘ్రముగ వెలువడ వచ్చును. లేదా అప్పుడప్పుడు పుండు మీద చన్నీళ్లు కొట్టు చుండిన చాలును. కొందరు చీపురు పుల్లను గాని వెదుర్ఫు పుల్లను గాని ఒక కొనయందు రెండుగా చీల్చి అచీలకలో నారి యొక్క కొనను దూర్చి నారినంతను పుల్ల చుట్టు మెల్లగ చుట్టి పెట్టుదురు. ప్రతి