Jump to content

పుట:AntuVyadhulu.djvu/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

నను, పురుష సంబంధమైన అంగములు మగ దాని తోక సమీపమున వుండును. ఆడుదాని గర్భ కోశము సామాన్యముగా శరీరము పొడుగున నొక గొట్టముగా నుండి క్రిక్కిరిసి యుండు పిల్లలతో నిండి యుండును. ఇవి తమకు కావలసిన ఆహారమును తమ పోషకుల సంపాదించి పెట్టు కొనిన దానిలో నుండి సంగ్రహించు కొనుచు తామేమియు శ్రప పడక వారల శరీరములో బ్రతుకు చుండును. ఇట్టి జంతువులకు పరాన్న భుక్కులు అని పేరు.(పారాసైట్) నారి పురుగు మానవ శరీరములో చర్మము క్రిందను, కడల మధ్యనుండు సందుల యందును నివసించును. గుర్రము మొదలగు ఇతర జంవువులలో కూడ కొందరు దీనిని కని పెట్టి యున్నారు. హిందూ డేసమునందలి కొన్ని స్థలములలో ఈ పురుగు ప్రజలలో రమారమి సగము మంది శరీరములో నుండును. సామాన్యముగ ఒక్కొక్క రోగిని ఒకటే పురుగు ఆశ్రయించి యుండును గాని కొందరికి నాలుగు, అయుదు చోట్ల యుండును. అరుదుగ 30 లేక 40 చోట్ల యందు కూడ ఈ పురుగు కనబడి యున్నది.

ఆడ పురుగు మానవ శరీరములో ప్రవేశించిన తరువాత ఒక అడుగు మొదలు ఆరు అడుగుల వరకు పెరుగును. ఇది కొంచెము పసిమి వర్ణముగల తెలుపు రంగు కలిగి తలనుండి కొన వరకు గుండ్రముగా నుండును. ఇది అంగుళములో రమారమి 20 వ వంతు లావుగ నుండి పేక దారము వలె కనబడు చుండును. తల వద్ద నున్న భాగము కొంచెము సన్నగిలి తుండము (ముట్టె) వలే నేర్ప