పుట:AntuVyadhulu.djvu/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశిష్ఠము

నారి కురుపు

నీటి మూలమున వ్వాపించు వ్వాధులలో ఇంత వరకు కలరా, సన్ని పాత జ్వరము, గ్రహిణి విరేచనములను గూర్చి తెలిసి కొని యుంటిమి. నారి కురుపును కలిగించు పురుగు పై వ్యాధులలోని సూక్ష్మ జీవుల వలె అతి సూక్ష్మమై కంటికగపడనిదిగా గాక మూడడుగులు పొడుగు కలిగి పేక దారము వలె స్పష్టముగ తెలియుచు లాగిన కొలదిని పుండు నుండి బయటకు వచ్చు చుండును. ఈ పురుగు కూడ ఒక రోగి నుండి అనేకులకు నీటి మూలమున ప్రవేశించుట చేత ఈ వ్వాధిని కూడ అంటు వ్యాధులలో చేర్చి ఇక్కడ వివరించి యున్నాము.

వ్యాపకము

అనాది నుండియు నారి కురుపు ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండములలో నున్నట్లు నిదర్శనములు కలవు. ఇది ఉష్ణ ప్రదేశములలో హెచ్చుగ నుండును. మిక్కిలి శీతల ప్రదేశములగు ఐరోపా మొదలగు ఖండము లందు ఈ పురుగు మిక్కిలి అరుదు. ఈ పురుగును, ఏలుగు పామును, నులి పురుగు మొదలగు మరి కొన్ని పురుగులను ఒక్క జాతిలోనివే. ఈజాతి పురుగులలో ఆడు దాని కంటే మొగది ఎప్పుడును చిన్నది గానుండును. స్త్రీ సంబంధమైన అంగములు ఆడు దాని శరీర మధ్యము