పుట:AntuVyadhulu.djvu/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

కొని నట్లుగా గుచ్చి వేసికొనెను. ఇక్కడ అధికమైన దురద పుట్టెను. దీని తలను నోటిని మిక్కిలి శ్రద్ధతో శోధించిన మరియొక వైద్యుడు ఈ ప్రకారము వ్రాయుచున్నాడు: తన దౌడల యొక్క కరుకైన కొనలతో ఇది తన కెరయగువాని శరీరము లోపలకు పొడిచి దాని నుండి ద్రవమును నెత్తురు కణములని పిండు కొని తాను భుజించును.

గజ్జి పురుగు ప్రపంచము నందన్ని భాగముల యందును గలదు. ప్రతి దేశమునందు బీద వార్లను హెచ్చుగను భాగ్య వంతుల నరుదుగను ఇది ఆశ్రయించి యుండును. ఈ వ్వాధి వీరి నుండి మరియొకరి కంటుటకు మొదటి వారి శరీరము లోనుండి రెండవారి శరీరములోనికి గర్భిణితో నున్న ఆడు గజ్జి పురుగొకటి ప్రవేశింపలయును. ఇట్టిది సంభవించుటకు పూర్వము ఒక పడక మీద పరుంటుట గాని లేక అంతటి సంపర్కము కలిగించు ఇతర సంయోగము గాని కావలయును. ఒకరి చేతి నొకరు పట్టు కొనినంత మాత్రమున అంటునని తోచదు. గజ్జి వచ్చిన కుదిరిన వారలు అదియున్నపుడు కట్టిన బట్టలను చక్కగ శుద్ధి చేయ కుండ తిరిగి కట్టు కొనిన యెడల తిరిగి అంట వచ్చును. భాగ్య వంతు లకు నౌకర్ల మూలమున గాని చాకలి వాని మూలమున గాని అంటు కొనవచ్చును. దీనికి పిల్లలు, పెద్దలును, భాగ్వవంతులు, బీదవారును అందరు నొక్కటియే. సోమరులును, దేహమును శుభ్రముగ నుంచు కొనని వారును, దీనికి మిత్రులు. ప్రతి దినము