పుట:AntuVyadhulu.djvu/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

229

కొంత గాలిని నోటితో మ్రింగును. ఒక్కొక ఆడుది సామాన్యముగా 15 మొదలు 50 గ్రుడ్లవరకు పెట్టును. ఇంతటితో దాని జీవిత పరమార్థము తీరి అక్కడనే చచ్చును. ఈ గ్రుడ్లు ఐదు మొదలు 15 దినములలో పెద్దవై తల్లి పోయిన మార్గము యొక్క పై గోడను తొలుచుకొని చరీరము పైకి వచ్చును. ఇది ఇట్లు బయటికి వచ్చు నప్పటికి దాని కారుకాళ్లే యుండును. ఇది అనేక విధముల రూప పరిణామము చెంది తుదకు ఎనిమిది కాళ్లు గలిగి ఆడుదిగనో మగదిగనో ఏర్పడును. ఇందు గర్భిణులైన ఆడువి మాత్రమే శరీరములోనికి తొలుచుకొని పోవును. మిగిలిన ఆడువియు మగనియు కూడ శరీరముపై స్వేచ్చగా తిరుగు చుండును. ఇవి రాత్రి మాత్రమే ఆహారమును తినును. తమ పనులను చేసికొనును. అందు చేతనే దురద పోటు మొదలగునవి రాత్రుల యందధికముగా నుండును. రొట్టెలు మొదలగునవి కాల్చు రాత్రి యంతయు మేలుకొని యుండు వారలకు తెల్లవారు జామున 4 గంటలకు బాధ ప్రారంభమగునని కొందరు శోధకులు వ్రాసి యున్నారు. మరి కొందరు రోగులకు రాత్రి 10 మొదలు 12 గంటల వరకు బాధ యధికమగును. ఈ బాధ పురుగు యొక్క చలనము వలననే గాక ఉమ్మి మూలమునను కూడ పుట్టునని తోచు చున్నది. హార్డి అను నతడు 8 గజ్జి పురుగులను ఒక నీటి బొట్టుతో నూరి దానిని తన చేతి వెనుక భాగమున టీకావేసి