226
ఒకచో నివసించ పలసి వచ్చినపుడు ఒకరి వస్తువుల నొకరు ఉపయోగ పరచ కుండ చేసిన చాలును. మంగలి వాడు తన కత్తులను మిక్కిలి శుభ్రముగ జేసి కొను నట్లుగా చూచి కొన వలెను. అనుమానము గల చోట్ల నెల్ల కత్తిని సల సల క్రాగు నీళ్లలో ముంచి సబ్బుతో శుభ్రముగ కడుగ వలయును. బడికి పోవు పిల్లలను అందు కొరకేర్పరుప బడిన డాక్టర్లు అపుడపుడు సోధించుచు మిక్కిలి వ్వాధిగల పిల్లలను బడికి రాకుండ ఉత్తరువులు చేయ వలెను. అట్టి వారలను వ్వాధి పూర్ణముగా కుదిరినట్లు డాక్టరు సర్టిపికేటు లేనిదే తిరిగి బడిలో చేర్చుకొనకూడదు.
శోభి
ఇదియు తామర వలెనే బూజు జాతిలో చేరిన ఒకానొక సూక్ష్మ జీవిచే అంటు చున్నది. ఇది సామాన్యముగా వయసు వచ్చిన వారికి అంటును గాని 8 సంవత్సరముల పిల్ల వానికి కూడ కాన వచ్చినది. క్షయ జాతి వ్యాధులు గల వార్ల శరీరము మీదను, చెమట పోయు స్వభావము గల ఇతరుల ఇతరుల శరీరము మీదను ఇది ఎక్కువగా కనపడునని తోచు చున్నది. ఇదియు ఒకరి నుండి మరియొకరికి అంటు కొని నదే గాని, భార్య భర్తలలో ఒకరి నుండి మరియొకరికి అంటుట లేదు గావున అంత గా అంటు స్వభావము గలదని చెప్పుటకు వీలు లేదు. దీని నివారించు పద్దతులకు తామర నివారణ పద్ధతులను చూడుము.