పుట:AntuVyadhulu.djvu/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

227

గజ్జి

ఇది అందరకును తెలిసిన వ్యాధియే. గజ్జి పుండ్లలో 22.వ. పటము లో చూపబడిన పరాన్న భుక్కు, జాతిలోని ఒక చిన్న జంతువుండును. దీని చరిత్రము మిక్కిలి విచిత్రమైనది. తప్పక చదువదగినది. పురుగులకు సామాన్యముగా ఆరు కాళ్ళుండును. దీని కెనిమిది కాళ్ళుండుటచేతే ఇది నిజముగపురుగు జాతిలో చేరినదిని చెప్పుటకు వీలు లేదు. కువురుపులు గల యొకని చేతిని మనము జాగ్రత్త పరీక్షించిన యెడల అందులో ఎక్కడనో ఒక భాగములో తెల్లని గుండ్రని చిన్ననలుసులు వంటి పదార్థములు కనబడును. అవి వట్టికంటికి కనుబడి కనుబడనంతపరిమాణము గలిగి యుండును . కొంచెము హెచ్చు అకారముతో చూపు భూత అద్దముతో ఈనలుసును పరీక్షించిన యెడల ముందు రెండు జతలును, వెనుక రెండు జతలును కాళ్ళు గలిగి తాబేలు వంటి ఆకారము గలిగిన జంవువు కనుపట్టును. ఇదియే ఆడు గజ్జి పురుగు ఇది పొక్కులున్న చోట చీములో నుండక ప్రక్క నెక్కడనో ప్రత్యే కముగ వంకర టింకరగ నుండు నొక సన్న రేఖ యొక్క కొన యందుండును. ఈ రేకలు సామాన్యముగా అర అంగుళము పొడవుగ నుండి స్వచ్యముగనుండు వారి శరీరములో తెల్లగను ఇతరుల శరీరములో కొంచెమించుమించు నల్లగను కనపడును. తల వద్ద నుండి రెండు జతల కాళ్ళకు ముట్టెలుండును. వెన్ముక వైపున నుండు