210
సగటున 10 దినములు పట్టును. ఈ దేశములో సామాన్యముగా సంవత్సరము పొడుగున ఈగలు గ్రుడ్లు పెట్టు చుండును. మగ ఈగల కండ్లు రెండును దగ్గరా నుండును. ఆడు దాని కండ్ల నడుమ ఎడమ హెచ్చుగా నుండును.
ఇట్టి ఈగలను పట్టుటకు ప్రతి రోగి ప్రక్కన ఈగ కాగితము నొక దానిని పెట్టిన యెడల వీని యుపద్రవము కొంత వరకు తగ్గును. ప్రక్క నున్న 44 వ. పటమును జూడుము. ఈగ కాగితములు అణాకు ఒకటి చొప్పున అమ్మకమునకు లభించును. క్షయ వ్వాధి పీడితులగు రోగు లెల్లప్పుడును మందు నీళ్లు గల పాత్రలలో ఉమ్మి వేయ వలెను గాని చుట్టు ప్రక్కల నుండు గోడల మీదను, ఉమ్మివేయ కూడదు. సాధరణముగా ప్రజలను ఇండ్లలో తలచిన చోట్ల నెల్ల ఉమ్ము వేయనీయ కూడదు. రోగులకు జ్ఞాపకము చేయుటకై జన సంఘములు చేరు చోట్ల నెల్ల ఇక్కడ ఉమ్మి వేసిన వారలు శిక్షకు పాత్రు లగుదురు అని ప్రకటక పలకలు విరివిగా మూల మూలలకు గట్టవలయును. క్షయ దగ్గు గల రోగులు ఇతరుల ముఖము మీద దగ్గ కూడచు. విసురుగ దగ్గినపుడు సూక్ష్మ జీవులు గాలితో పాటు బయట పడి ఎదుట వారినంట వచ్చును. వీరు సభలకు పోవునప్పుడు తమతో కూడ చేతి రుమాళ్ళుగాని పాత గుడ్డలు గాని, ఇప్పుడు జపానునుండి వచ్చు చున్న కాగితపు జేబు రుమాళ్ళుగాని సంచులుగాని తీసికొని పోవలయును. దగ్గు వచ్చినపు డెల్లను క్రింద