పుట:AntuVyadhulu.djvu/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

195

ఆటలమ్మ

సామాన్యముగా పిల్లలకు ఏ విధమైన బాధయు లేకుండగనే మొదటి రోజునే శరీరము మీద అక్కడక్కడ ఎర్రని పొక్కులు పొక్కి వెంటనే నీటితో నిండి యున్న కుండలుగా మారి పోవునట్టి ఒక అంటు వ్యాధి. ఈ కుండలలోనీ నీరు క్రమక్రమంగా ఎండి పోయి చిన్న చిన్న పక్కు లేర్పడును. సామాన్యముగ జ్వరముండదు. కుండలలో చీము పట్టదు. ఎవ్వరును దీనిచే చావరు. పిల్లలాడుకొను చుండగనే ఈ వ్యాధి వచ్చి పోవును. కావుననే మనవారు దీనికి ఆటలమ్మ యని పేరు పెట్టిరి.

వ్యాపకము

రోగిని ఇతరులు తాకుట చేతను బహుశః ఇతర సంపర్కము చేతను గూడ ఇది వ్యాపించును. ఒక రోగి పక్కులలోని రసము నెత్తి ఇతరులకు టీకాలు వేసిన యెడల వార్లకు ఆటలమ్మ రాదని చెప్పుటకు వీలు లేదు.

నివారించు పద్ధతులు

ఈ వ్వాధి చంపునది కాక పోవుట చేత శానిటరీ అధికార్లకు దీనిని గూర్చి ప్రకటన చేయ నక్కర లేదని కొందరి అభిప్రాయము. ఆటలమ్మకును మశూచకములకును గల భేదము అందరకు సులభముగా తెలియక పోవచ్చును. కాబట్టి ఒకా నొక్కప్పుడు మశూచకపు వ్యాధిని ఆటలమ్మ అని ప్రజలు తలచి అధికార్లకు తెలియ జేయక వోవచ్చును. ఇట్టి