పుట:AntuVyadhulu.djvu/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

2.బడి పిల్లలలో తట్టమ్మ వచ్చినపుడు ఉపాధ్యాయుడు వెంటనే అధికార్లకు తెలుప వలెను. ఈ వ్యాధి కల ఇంటిలో నుండు పిల్లల నెవ్వరిని బడికి రానీయ కూడదు. బడిలో అనేక మందికి ఈ వ్యాధి కనుపించిన యెడల వెంటనే బడి మూసి వేయవలెను. సెలవు దినములలో ఇంటికి పోయిన పిల్లలందరును తమ ఇంట అంటు వ్వాధి ఏదియును లేదని వైద్యుని వద్ద నుండి గాని ఇంటి యజమాని వద్ద నుండి గాని సర్టిపికేటు తీసుకొని రావలయును

3. రోగిని, వ్యాధి తెలిసిన వెంటనే ప్రత్యేక పరచుట కూర్చియు రోగి యుండు స్థలమును శుద్ధి జేయుట గూర్చియు 12, 13 ప్రకరణములలో వివరించిన విషయములను గనమింప వలెను. లేదా రోగిని వెంటనే ప్రత్యేకముగ అంటు వ్యాధుల కేర్పరుపబడిన ఆస్పత్రికి పంప వలయును. మన దేశమునందు ప్రజలకు ఈ వ్వాధి యన్న బొత్తిగ భయమేలేదు. పైన చెప్పిన కొద్ది పాటి నిబంధనలను గమనించిన యెడల ఈ వ్యాధి వ్యాపకమును చాల వరకు మాన్ప వచ్చును. రోగుల నుండి వచ్చు కఫము చీమిడి మొదలగు నవి రోగి చర్మము నుండి రాలు పొట్టి కంటె ఈ వ్వాధి యొక్క వ్యాపకమును హెచ్చు చేయునని తోచు చున్నది. తట్టి పోసిన 15 దినములైన తర్వాత గాని రోగిని చక్కగ స్నానము చేయించి తర్వాత గాని ఇతరులతో కలియ నీయ రాదు. అపుడైనను జలుబు గాని దగ్గు గాని ఏమియు నుండకూడదు.