Jump to content

పుట:AntuVyadhulu.djvu/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

లను మశూచకపు రోగులతో సంబంధముగల ఇతరులును నివశింప జేయుటకై ఆదే ఆవరణములో ప్రత్యేకముగ, వైద్య శాలకు దూరముగ, ఇండ్లు కట్టి యుంచ వలయును.

ఈ వైద్య శాలలో నౌకరీ చేయు వారలందరును ఖాయముగ అక్కడుండు వారైనను సరే లేక పుడపుడు నౌకరికి వచ్చు వారలయినను సరే వారుచేయు నౌకరీ ఎట్టిదైనను వారలకందరకు ఆస్పత్రిలో ప్రవేశించక మునుపే తిరిగి టీకాలు వేయవలయును. ఆస్పత్రిలోనికి ఎప్పుడో మిక్కిలి అవసరము ఉన్నప్పుడు తప్ప చూచు వారలను రానీయకూడదు. మిక్కిలి తప్పని సరిగా ఎవరినైనను పోనీయ వలసిన ఉన్నయెడల అట్టి వారికి తిరిగి టీకాలు వేసి ఆస్పత్రిలోనికి పోక ముందే తడుపుటకు వీలైన ప్రత్యేకపు దుస్తులనిచ్చి వారు తిరిగి వచ్చిన వెంటనే మందు నీళ్లలో స్నానము చేయించి శుద్ధి చేసిన తమ దుస్తులను తొడుకు కొని నీయ వలెను. లేని యెడల చూచుటకు వచ్చు వారలను పదునాలుగు దినముల వరకు అదే ఆవరణములో ప్రత్యేకముగ శోధనలో నుంచి పిమ్మట పంపి వేయవలయును. రోగుల బంధువులకును, స్నేహితులకును కావలసిన సమాచారము లన్నిటిని చెప్పుటకు దూరముగ నొక స్థలమును ఏర్పరచి అక్కడకే వారు వచ్చి పోవు నట్లు ఏర్పాట్లు చేయ వలయును. కాని అయిన వారును, కాని వారును ఆస్పత్రి లోనికి పోకూడదు.