పుట:AntuVyadhulu.djvu/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

189

వలయును. రోగి యుండు ఇంటిని, రోగి యిండ్లకు వచ్చిన వారి యిండ్లను పదునాలుగు దినముల వరకు అధికారులు ప్రతి దినమును శోధించు చుండవలయును. మరి పదునాలుగు దినముల వరకు అప్పుడప్పుడు శోధించు చుండ వలయును. వ్వాధి వలన చనిపోయిన శవమునుండి ఈ వ్యాధి మిక్కిలి వ్యాపింప వచ్చును గాన అట్టి వానిని వీధుల వెంట దీసుకొని పోవుటకు పూర్వము, సుద్ధి చేయు మందు నీళ్లలో తడిపిన మందు గుడ్డలతో చక్కగ కప్పి తిన్నగ శ్మశానమునకు తీసికొని వెళ్ళి కాల్చవలెను.

మశూచకపు వైద్యశాల

మశూచకము పైద్య శాలలకును, తక్కిన వైద్యశాలలకును ముఖ్యమైన బేధములు కొన్ని కలవు.

స్థలము:- ఇండ్లకును, రోడ్లకును, ప్రజలు పలుమారు వచ్చుచు పోవు చుండు ఇతర స్థలములకును, ఈ వైద్య శాల మిక్కిలి దూరముగ నుండ వలయును. ఈ వైధ్యశాలలు ఇతర అంటు వ్యాధుల వైద్య శాలలతో కూడ సంపర్కము కలిగి యుండ కూడదు. ఇట్టి వైద్య శాల కట్టవలయుననిన మిక్కిలి విశాలమైన స్థలము కావలయును. ఏలయన దీని చుట్టు నాలుగు వందల గజములకు లోపల ఏ యిండ్లును ఉండకూడదు. ఇట్టి వైద్య శాలలో గాలియి, వెలుతురును, మిక్కిలి చక్కగ వచ్చు చుండవలయును. అనుమానము గల మశూచకపు రోగు