పుట:AntuVyadhulu.djvu/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

చనములోని సూక్ష్మ జీవులు మార్తు చెందకుండ రెండవ రోగికి చేరవనుట స్పష్టము.

2. పురిటి ఇండ్లు :- ఇచ్చట ఈ సూక్ష్మ జీవులు వృద్ధి బొందుటకు తగిన ఆహారముండవలెను. ఇది మూడు విధములుగ నుండ వచ్చును.

(అ) మలము మూత్రము మొదలగు వానితొ గాని చెత్త మొదలగు కుళ్ళు పదార్థములతో గాని కూడిననేల లేక మురికి కుండ్లు.

(ఇ) ఇట్టి పదార్థముల సంపర్కము గల చెరువులు, నూతులు, కాలువలు మొదలగు వానిలోని నీరు.

(ఉ) పాలు, అన్నము, కూరగాయలు, పండ్లు మొదలగు ఇతర పదార్థములు.

ఇట్టి ఆహార పదార్థములలో నేది యేదైనను దొరికినను ఈ పురుటిండ్లతో వీని వృద్ధికి తగిన శీతోష్ణస్థితి యుండిన గాని ఇవి వృద్ధి పొందవు. ఎక్కువ చలిగాలి వీనికి పనికి రాదు.

3. మార్గములు:- గాలి వలన ఈ సూక్ష్మ జీవులు ఒక గ్రామము నుండి మరియొక గ్రామమునకు పోవుట యసందర్భము. ఏలయన తడి లేని గాలిలో గాని ఎండలోగాని ఈ సూక్ష్మ జీవి వెంటనే చచ్చి పోవును. కాబట్టి దీనిని మోసికొని పోవుటకు ఏవో ఇతర సాధనములు వుండవలెను. ఒక వేళ ఒక చోట నుండి మరియొక చోటి కీ సూక్ష్మ జీవులు ఎగిరి పోగలిగినను అచ్చటి నేల యందు