Jump to content

పుట:AntuVyadhulu.djvu/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

పదార్థములతో క్రొత్త పదార్థములయి వాని వాసన మారి పోవును.

11. హైడ్రొజన్ పర్ ఆక్సైడు ఉదజన పరామ్లజిదము. ఇందు ఆమ్లజని (ప్రాణవాయువు) నీటిలో లీనమయి యుండును. ఏదైనను క్రుళ్లుచుండు పదార్థములో ఇది చేరిన తోడనే దీని నుండి ప్రాణవాయువు వెలువడి అది సూక్ష్మ జీవుల పెంపు నణచును. ఇది మిక్కిలి విలువ గల దగుట చేత దీనిని సామాన్యముగ నుపయోగించుటుకు వీలులేదు. శానిటాస్ అను నదియు నిట్టిదియే. నూటికి రెండు పాళ్ల చొప్పున నీళ్లతో చేర్చి దానితో కొంచెము చెడిన మాంసము మొదలగు వానిని శుద్ధి చేసికొన వచ్చును. ఇందు మన శరీరమునకు పడని పదార్థమేదియును లేదు.

12. పొటాసియ పర్మాంగనితము: ఇది ఉదా రంగు గల పలుకులుగా నుండును. దీనిని నీళ్ళలో కలిపి నప్పుడు చంద్ర కాంత పూవు వంటి ఎరుపు రంగు గల ద్రావకము ఏర్పడును. ఈ ద్రావకము కుళ్ళు చుండు పదార్థములతో చేరి నప్పుడు దీని నుండి ప్రాణ వాయువు వెలువడి అది ఆ పదార్థములతో కూడి వానిని సుద్ది చేయును. ఇది నూటికి 5 పాళ్లకంటె తక్కువగ నున్న ఎడల సూక్ష్మ జీవులను నిశ్చయముగ చంపునని చెప్పుటకు వీలు లేదు. మిక్కిలి పలుచని ద్రావకము తప్ప, ఎంత మాత్రము చిక్కగ నున్నను దీని వలన