పుట:AntuVyadhulu.djvu/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

149

గుల్లతో చేసిన నీళ్లు ఇండ్లను శుద్ధి చేసి కొనుటకు మిక్కిలి యోగ్యమైనవి. కాని సుద్ధతో కలిపిన వెల్ల నిష్ప్రయోజనము.

9. టించర్ అయోడిన్ : ఇది మిక్కిలి తీవ్రమైన శక్తి గలది. నిమిషములో సూక్ష్మ జీవులను చంపును. శస్త్రము చేయు భాగము మీదనుండు చర్మములో నివశించు సూక్ష్మ జీవులను చంపుటకు గాను శస్త్రము చేయక ముందు ఈ టించరు అయోడిన్ ను పూయుదురు. ఇందుచే ఆ భాగము శుద్ధి యగును. కొందరు శస్త్ర వైద్యులు చేతులు కడుగు కొనుటకు కూడ దీనినే యుపయోగింతురు. కాని దీని వెల మిక్కిలి అధికమగుటచే దీని వ్యాపకము అంత హెచ్చగుటకు వీలులేదు.

10. సీమరోటి బూడిదె (బ్లీచింగ్ ఫౌడర్) దీనిని బజారులలో క్లోరైడు ఆఫ్ లైము అందురు. ఇది దుర్వాసనలను పోగొట్టుటకును, మురుగు కాలువలు, మురుగు తొట్లు, మరుగు దొడ్లు మొదలగు వానిని శిద్ధి చేయుటకు, మిక్కిలి యుపయుక్తమయినది. దీనిని ఎల్లప్పుడు మిక్కిలి పొడిగా నుంచ వలెను. దీనిలో ఎంత మాత్రము తేమ చేరినను దీని తీవ్రత తగ్గి పోవును. ఇది నీటితో చేరినప్పుడు దీని యందలి హరితము (క్లోరైన్) నీటి యందలి ఉదజని తో చేరి నీటి నుండి ప్రాణ వాయువును వెడల గొట్టును. ఈ ప్రాణవాయువు (ఆమ్లజని..... ఆక్సిజన్) దుర్వాయువులను పుట్టించు