పుట:AntuVyadhulu.djvu/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కణవాదము: తిండిపోతు తెల్లకణములు

89


కణములే మనలను సూక్ష్మజీవులనుండి కాపాడుటకాధారమనియు మెచ్ని కాఫుయొక్క వాదము. ఈతని వాదమునకు కణవాదమని పేరు.

పైని జెప్పిన ప్రకారము తిండిపోతు తెల్ల కణములు మనకుచేయు నుపకార మొప్పుకొన తగినదేకాని, ఈతని కణ వాదము పూర్ణముగా నంగీకరింప తగినది కాదని యిటీవలి వారు నిర్ధారణము చేసి యున్నారు. నెత్తురునుండి తెల్లకణములను ఎర్రకణములను అన్నిటిని వడపోసి తీసివేయగా మిగిలిన రసమునందుకూడ సూక్ష్మజీవులను మనము వేసినప్పుడు అవి చచ్చుననియు, కావున రక్తమునందలి రసమునకుకూడ సూక్ష్మజీవులను చంపు గుణము గలదనియు నిటీవలివారు కనిపట్టి యున్నారు.

ఇట్లు సూక్ష్మజీవులను చంపుగుణము రక్తమును 55 డిగ్రీలవరకు అనగా మనము చెయ్యి పెట్టలేనంత వేడివచ్చు నంతవరకు కాచినయెడల నశించిపోవును. ఇతర మాంసకృత్తుల (Proteids) తోపాటు ఈ పదార్థములను కూడ వడపోసి తీయవచ్చును. ఆరబెట్టి పొడిచేయవచ్చును. తిరిగ నీళ్లలో కలపవచ్చును. ఇట్లు చేసినను వాని శక్తిపోదు. కాని ఈ పదార్థమును విడిగా తీయవలెనన్న శక్యము కాలేదు. కొద్దిపాటి వేడిగాని వెలుతురుగాని ప్రాణవాయువుగాని తగిలిన తోడనే దీని శక్తి నశించిపోవును.