పుట:AntuVyadhulu.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

తొమ్మిదవ ప్రకరణము


కాఫ్ అనునతడు మొదట నొక ఈగయొక్క రక్తములోని తెల్లకణ మొకటి సూక్ష్మజీవుల గ్రుడ్డు నొకదానిని పట్టితినుట కనిపట్టెను. పిమ్మట ఇతడు కొన్నికప్పలకు దొమ్మవ్యాధి నెక్కించి ఆ దొమ్మవ్యాధి సూక్ష్మజీవులను కప్పలలోని తిండిపోతుకణములు తినుట చూచెను. అటుతరువాత నెక్కడ సూక్ష్మజీవులు ప్రవేశించినను, అక్కడకెల్ల నీ తిండిపోతు తెల్ల కణములు పరుగులెత్తుకొని వచ్చుచుండుట నితడు కనిపెట్టెను. చచ్చిన సూక్ష్మజీవుల శవములును, వానినుండి పుట్టిన యేవో కొన్ని మాంసకృత్తు పదార్థములును తెల్లకణములను సూక్ష్మజీవులవద్ద కాకర్షించుననియు మిక్కిలి యుధృతమైన క్రౌర్యముగల సూక్ష్మజీవుల విషములయందు తిండిపోతు కణములను దూరముగ తోలుశక్తి గలదనియు కొందరు శోధకులు కనిపట్టి యున్నారు. సూక్ష్మజీవులేగాక సూక్ష్మజీవుల గ్రుడ్లను గూడ తిండిపోతు తెల్లకణములు మ్రింగును. కాని అవి సాధారణముగ జీర్ణముకావు. తెల్లకణము లీ గ్రుడ్లను మోసికొనిపోయి మరియొకచోట విడిచినప్పుడు మిక్కిలి తీవ్రముగ పెరుగ నారంభించి వేనవేలయి తిరిగి యక్కడ హానిజేయుటకు ప్రారంభించునని మెచ్ని కాఫుకనిపట్టియున్నాడు. నెత్తురులోని తిండిపోతుకణముల సంఖ్యనుబట్టి యొకానొక వ్యాధియందు సూక్ష్మజీవులు గెలుచునా మనశరీరము గెలుచునా యను విషయమెల్లప్పుడును తెలిసికొనవచ్చు ననియు, నీ తిండిపోతు