Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

123 వైకుంఠాననుండి యూళువారలలో పలనుండి! లోకపు నిత్యముక్తులలోన నుండి శ్రీకాంతతోడ నున్న శ్రీ వేంకటేశుఁ గూడి! ఈకడ నారగించ నింటికి విచ్చేయవే Iదిన 2 సంకీర్తనముతోడ సనకాదు లెల్లఁ బాడ పొంకపు శ్రీవెంకటాద్రిభూమి నుండి! లంకె శ్రీవెంకటగిరి లక్ష్మీవిభుఁడ నీవు అంకెల మాయింటవిందు లారగించవే |lదిన 3 అన్న, అధ్యా, తేకు. మదరాసువిడిచి శ్రీ తిరుపతి వేంకటేశ్వరుల సన్నిధి సేవకావింప వచ్చుటలో నాతోల్లటికోరిక తాళ్ళపాకవారిరచనల నన్నింటిని వెల్లడించుట. ఎంత ప్రయత్నించినను నడ్డంకులచే నింకి పోవుచున్న నాసంకల్పపు టూటలు చక్కసాగుట కద నిప్పటికి సమకూడినది. ఇక్కడనున్న తాళ్ళపాకవారిసంకీర్తనములు రాగిరేకుల లన్నింటిని స్వాధీనము చేసి కొంటిని. అస్మదీయుఁడు నాకుఁ జేదోడుగా ననువర్తించు పరిశోధనకార్య సహాయ విద్వాంసుఁడు చిరంజీవి. ఎ.వి. శ్రీనివాసాచార్యుఁడు వేలలెక్క నున్నరాగిరేకుల భరము మోయుచు బడలుచున్నను సంకీర్తనముల స్వారస్యాస్వాదనవున శ్రవుతీర్చుకొనుచు నర్వవరిశోధన సందర్భములందు జాగరూకుఁడై తోడ్పడుచున్నాఁడు మిత్రులై డైరెక్టరు శ్రీపరవను వెంకటరామానుజస్వామి, ఎం.ఏ. గారు నా కీకార్య నిర్వాహములో సహాయపడుచున్నారు. దేవస్థానమునఁ బైముఖ్యాధి కారు లిందుకుఁ జాల ముచ్చట పడువారుగానున్నారు. ఇఁకఁ జక్కగాఁ దాళ్ళపాక సంకీర్తనముల ముద్రణము సాగగల దనుకొందును. ముద్రితము లయిన సంకీర్తనములఁగొన్నిటిని సంగీతసాహిత్యపరిపుషులు శ్రీఅనంత కృష్ణశర్మ గారు న్వరవిన్యానముతోఁ బ్రకటించుచున్నారు. ఇ ట్టిన్నాళ్ళకుఁ దాళ్ళపాకమహనీయుల స్వామి సేవాఫలము పరిపక్వమై సహృదయా