పుట:Andrulasangikach025988mbp.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రతోమరములు, శార్జ్గసంఘంబు

చురికలు, బాణముల్. శూలచయమ్ము

మొదలైన శస్త్రాస్త్రములు ..."[1] వాడిరి.

శత్రువులు దండెత్తి వచ్చిన కోటలను భద్రము చేసుకొనుచుండిరి. ఆ విధానమును కొంతవర కీ క్రింద పద్యమునుండి గ్రహింపవచ్చును.

      "కోట సింగారించి కొత్తళంబుల నెల్ల
       నట్టళ్ళు పన్నించి యాళువరికి
       పందిళ్ళు పెట్టించి పైకొమ్మ లెగయించి
       గుండు దూలము వసికొయ్య గూర్చి
       యగడితలీత నీరలవడ ద్రవ్వించి
       వెలిజుట్టును వెదురు వెలుగు వెట్టి
       దంచనంబులు దద్దడంబులు నెత్తించి
       పలు గాడితలుపులు బలువు చేసి

గీ॥
   బాళెములు వెట్టి కొంకులు బ్రర్దపరులు
      కత్తిగొంతంబు లొడిసెళ్లు గత్తళములు
      నారసములును విండులు నగరిలోన
      బెట్టిపెట్టుడు నడు నెట్టి మట్టిలావు."[2]

యుద్ధయాత్రకు ఆంధ్ర సైనికు లెట్లు వెడలుచుండిరో, యుద్ధరంగమున నెట్లు శ్రమిస్తుండిరో, యుద్ధ ధర్మము లెట్టివై యుండెనో పల్నాటి వీరచరిత్రము తెలుపు చున్నది.

యుద్ధమునకు వెళ్ళువారు తమకోటకు తగురక్షణ లేర్పాటు చేసి భూసుర పురీహితులచే జయముహూర్తము పెట్టించి ప్రయాణ భేరి వేయించి వెడలుచుండిరి.[3] సేన వెంట గొల్లెవలు, పట కుటీరములు, బల్లాకి

  1. పల్నాటి వీరచరిత్ర, పుట 105.
  2. నాచన సోముని ఉత్తర హరివంశము, అ 2, ప 92.
  3. పల్నాటి వీరచరిత్ర, పుటలు 3, 4,