పుట:Andrulasangikach025988mbp.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"కితాబాతె హిందూ కె గోయంద్‌బర్దష్" బర్ద్ అనేది తెనుగై యుండ వలెకదా! స్తోత్రపాఠకులను వంది, భట్టు అని యందుము. ఈ రెంటిలో నేదే నొకదాని యపభ్రంశముగా బర్ అనున దేర్పడియుండును.

ఆ కాలమం దాంధ్రు లెట్టి ఆయుధముల నుపయోగించిరో కొంతవరకు ప్రతాపరుద్ర యశోభూషణము వలన తెలియగలదు. కాని అవన్నియు నిజమైనవో లేక కవికపోలకల్పితములందు కొన్ని కలవేమో చెప్పజాలము. ప్రతాప రుద్రీయముపై రత్నాపణవ్యాఖ్య కలదు. అందిట్లున్నది.

తోమర: = దండవిశేష:

కౌక్షేయకా: = ఖడ్గా:

ముసుందయ: = దారుమ యాయుధ విశేష: కఱ్ఱతో చేసిన ఒక విధమగు ఆయుధము.)

కార్ముక: = ధమ:

గదా: = (గదలు)

కుంతా: = పరంపరయా క్షేపణీయా ఆయుధ విశేషా: (వెను వెంట విసరి వేసెడు ఒకవిధమగు ఆయుధాలట!)

పట్టప: = లోహదండ:, యస్తీక్ష్ణధారక్షరోపమ: (వాడిధార కల ఇనుప దండమట! బహుశా పట్టాకత్తియై యుండును.)[1]

కత్తులు మంచివిగా నుండుటకై నాలుగు లోహములతో చేయుచుండిరి.

"విను మినుమును, రాగి, యిత్తడి, కంచు

పెట్టి చేసినయట్టి బిరుదలు కలవు"[2]

(ఇచ్చట బిరుదులన ఆయుధములు) పల్నాటి యుద్ధములో,

"కుంతములును, గండ్రగొడ్డండ్లు, గదలు,

ముసల ముద్గరములు, మొనల కటార్లు

  1. పల్నాటి వీరచరిత్ర పుట 78.
  2. ప్రతాపరుద్రీయము, నాయక ప్రకరణము, 11 - వ శ్లోకం.