ఈ పుట ఆమోదించబడ్డది
5. చంద్రశేఖర శతకము, కవి తన పేరు చెప్పుకోలేదు. ఇది హాస్య రసముతో నిండినది. నెల్లూరి గ్రామ్యము ఏస ఇతర ప్రాంతాల వారికి తెలియనందున అట్టి పదాల కర్థము వ్రాసి ప్రకటించుట బాగు.
6. అడిదము సూరకవి - రామలింగేశ్వర శతకము,
7. వేణుగోపాల శతకము.
8. భాస్కర శతకము.
ఈ ప్రకరణానికి అన్నియు శతకాలే (వేమన శతకమందురు కాన అదియు నిందే చేరును.) ఆధారభూతములైనవి.
మంచి కవు లీ కాలములో అరుదైరన్నమాట : అది యీ సమీక్షా కాల మందలి దుస్థ్సితి కొక తార్కాణ.