పుట:Andrulasangikach025988mbp.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7వ ప్రకరణము

క్రీ.శ. 1757 నుండి 1857 వరకు

ఔరంగజేబు 1707లో చచ్చెను. సిరా జుద్దౌలా 1757లో చచ్చెను. ఈ 50 ఏండ్లలో మొగల్ సామ్రాజ్యము క్రమక్రమముగా క్షీణిస్తూ వచ్చెను. ఈ కాలములో మహారాష్ట్రులదే భారత దేశమందు ప్రప్రథమ శక్తిగా నుండెను. 1199 లో బెంగాలును తురకలు 18 మంది సవార్లతోనే జయించిరి: ప్రపంచ చరిత్రలో ఇంతకన్న చిత్రమగు ఘట్ట మింకొకటి కానరాదు !! 550 ఏండ్ల తర్వాత ఆ తురక సుల్తానుల సంతతివారే ప్లాసీ యుద్ధములో గొప్పపరాజయము పొందిరి. ఇంగ్లీషువారి విజయం కూడా 1199 నాటి తురకల విజయ మంతటి కారుచౌక విజయమే: (The British Victory at Plassey Was gained nearly as that of Md. Khilji. V. Smith) హిందువులపై అంత సులభముగా విజయాలుపొందిన ముసల్మానుల కేల యా దుర్గతి పట్టెను. హిందువులు నాలుగైదు నూర్లయేండ్ల అనుభవముతొకాని బుద్ధితెచ్చుకోలేదు. మహారాష్ట్రులు సహ్యాద్రి పర్వతాలలో గుర్రపు సవారీలలో, కరకుతనములో, కూలు యుద్ధములో, చాకచక్యములో, సాధన పొంది ముసల్మానులకు మంచి జవాబిచ్చిరి. కాని రాజపుత్ర సైన్యమే డిల్లీసుల్తానులకు భారతదేశాన్ని గెలిచి యిచ్చెను. అనగా వారికి మతాభిమానము దేశాభిమాన మింకను కలుగ లేదన్నమాట. తురకలు బలహీనులైరి. విషయలోలురైరి. అంతలో ఇంగ్లీషువారు భారతరంగముమీద ప్రత్యక్షమైరి. తురకలు దౌర్జన్యము, మేలైన యుద్ధతంత్రము, మతావేశము, క్రౌర్యము, మోసము, బీభత్సము తమతోపాటు తెచ్చుకొని యుండిరి. ఆ గుణాలు ప్లాసీ యుద్ధము వరకు వారిలో స్థిరముగానే యుండెను. కాని వారికి గురుస్థానమం దుండదగిన ఇంగ్లీషువారున్నూ కొన్ని గుణాలతొ దేశమందు దిగుమతి అయిరి. వారు మనదేశములో వరహాల చెట్ల నూపి రాలిన ద్రవ్యాన్ని మూట కట్టుకొని పోవుటకు ప్రధానముగా వచ్చియుండిరి. యూరోపు దేశములో మేలైన తుపాకులు, ఫిరంగులు కనిపెట్టి యుండిరి. అని వారి వెంట వచ్చెను. హిందూ ముసల్మానులు ఫిరంగులను క్రీ.శ. 1401 నుండి వాడుతూ వచ్చినను అవి కొద్దిపాటివి.