పుట:Andrulasangikach025988mbp.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాని చేతిలో శ్రీకారము ఆ యాయుధముతోనే వ్రాసి పంపి రెండవ వానిచేతిలో ఆయుధమును ఊరక తాకించి (చుక్కపెట్టి) పంపి మూడవవాని కొక దెబ్బ, నాల్గవ వానికి రెండు ఈ ప్రకారముగా ఆలస్యముగా వచ్చిన వారికి శిక్ష యిచ్చేవారు.

'చెలియ నఖాంకురాళినెల చేడియసైకము తాను చుక్కనున్‌' అని విజయ విలాసములో చేమకూర వేంకటకవి సూచించినాడు. నక్షత్రాలు ఆమె గోళ్ళ తళుకుముందు రెండవ స్థానము నొందినవే అని కవి చమత్కరించినాడు.

వర్షమునకు ఎండకు గొడుగులు పట్టుకొనుట ఆకాలమందు కానవస్తున్నది. కాని ఇప్పటి బట్ట గొడుగులు కాకపోవచ్చును. నేటికిని తిరువాన్కూరులో, కొచ్చిన్‌లో వెదురుకట్టెకు తాటియాకులను గుండ్రముగా ఛత్రవలె కట్టి వాడుదురు. వాటిని కొడే అందురు. అ పదమే మన గొడుగుపద మనుటలో సందేహము లేదు. అయితే బట్ట ఛత్రీల వాడుక మన పూర్వీకులకు తెలియదని కాదు. దేవతా విగ్రహాలను ఊరేగింపు కాలములోను, రాజుల ఊరేగింపు కాలములోను రెండు గజాల పొడవు కట్టెకు రంగుల పట్టుబట్టలతో ఛత్రీలనుగా కుట్టి వాడుచుండిరి. క్రీ.శ. 1700 ప్రాంతపువాడగు భాస్కర శతకకారుడు ఇట్లు వ్రాసినాడు.

      కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికు డొక్క డొక్కడే
      కలిగెడుగాక పెందఱుచు గల్గగనేరరు చెట్టుచెట్టునన్
      గలుగగ నేర్చునే గొడుగు కామలు చూడగ, నాడనాడ నిం
      పలరగ నొక్కటిక్కటి నయంబున జేకురు గాక భాస్కరా.

ఆ కాలపు జనుల వేడుకలలో తోలుబొమ్మలాట ఒకటి.

ద్విపద ప్రబంధాలు వివిధములగు పాటలు, తోలుబొమ్మ లాటలు, మన తెనుగువారిలో ఆదికాలము నుండియు ఉండినట్టివని యిదివరకే తెలుపనైనది. చాలా ప్రాచీనుడగు పాలకురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ఇట్లు వ్రాసినాడు.

      భ్రమరాలుజాళెముల్ బయనముల్ మెఱసి
      రమణ పంచాంగపేరణి యాడువారు