పుట:Andrulasangikach025988mbp.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడి బ్రాహ్మణేతరులను వారి యాచారాలను అతడు వెక్కిరించి హేళన చేసినాడు. అతని కాల మేదో తెలియదుకాని ఇంచుమించు క్రీ.శ. 1700 ప్రాంతమువా డని విపులముగా ఊహించుకోవలసినదే.

మన దేశములో పొగాకును ప్రవేశ పెట్టి దేశమును నాశనం చేసిన మహనీయులు పోర్చుగీసువారు. అది క్రీ.శ. 1600-1650 ప్రాంతములో ప్రవేశ పెట్టబడెను. ఈ శతకములో దాని ముచ్చటవచ్చినందున ఈకవి 1650 నుండి 1750 లోపలివాడుగా నుండియుండును.

      సీ. దగిడీల బాపల పసిద్ధినరే, పోగ నిప్పుకంట, పొమాదుగులింటి
         కోయి, బతి మాలితి, మూడు నెగళ్ళు మండుతై, లేదనితిట్టె,
         పాపపు కలిగ్గము, యింత పరాక' దాట్లొ యీ
         రాదట, యంద్రసహ్యులు దురాత్ములు మూర్ఖులు చంద్రశేఖరా.'

మన చిన్నతనమువరకు పల్లెలలో భాగవత, భారత, రామాయణ పురాణాదులను చదువుట చెప్పుట పల్లెజనులు వినుట ఆచారముగా నుండెను. ఈ శతక కాలములో భాగవతము, రామాయణము గరుడ పురాణము చెప్పువాడుక అతని ప్రాంతమున యుండెననవచ్చును. గ్రామాలలోని జనులకు ధనికులయిన గ్రామ ముఖ్యులు ఉచితముగా వినోదాలను ఏర్పాటు చేస్తుండిరి. గ్రామరెడ్డి ఏర్పాటు చేసిన దొమ్మరాటయే ఆకాలపు 'సర్కసు'.

        'మెడ్డుగ దొమ్మరెక్కగన మించిన యిద్దె మరేడ లేదు నా
         తెడ్డొకబాప నిద్దెలని తిట్టును మూర్ఖుడు చంద్రశేఖరా!'

బాపల విద్యలేవికూడ దొమ్మరివిద్యతో సరిపోలవట;

తందాన కథలను జంగము కథలనీ, బుర్రకథలనీ అందురు. ఆ కథలు జనుల కత్యంత ప్రీతికరములై యుండెను.

        'ఇంటిని తిమ్మరాజుకత, యింటిని యీర్ల కథాప్రసంగముల్
         ఇంటిని పాండులాలి, యిబమింటిని నాయకురాలి శౌర్రెమె
         ప్పంటికి నందివాక్కముల పాండు చెరిత్రల నామభాగ్యమె
         న్నంటికి గల్గునోయను నవజ్ఞుడు మూర్ఖుడు చంద్రశేఖరా.'

(యీర్లకథ=వీరులకథ, నాయకురాలి శౌర్రెము=పల్నాటివీరుల సుద్దులలోని ఆర్వెల్లి నాయకురాలి. చరిత్ర) పల్లెజనులకు బయలునాటకాలు మరొక