పుట:Andrulasangikach025988mbp.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           సూతముల్ పుహుడక శుద్ధపద్దతి
                చిత్ర పద్దతి ఘనదేశ పద్ధతులును
           కై లాట లంబక కరణైక తాళికో
                లాసాది గీత హల్లీసకములు
           నాదిగాగల్గునృత్యనృత్యైక్య ముఖ్య
               నాట్యవిధములుసూచించి నయ మెలర్ప
           జనులకెల్లను లోచనోత్సవముగాగ
               నాదెనాయిందముఖకొనియాడె జగము[1]

           (ఇందును కొన్ని పదాలు తెలియవు)

తాళాలలో జంపె ధ్రువాద్యాట తాళాలు విశేష ప్రచారమందుండెను. (జంపె, ధ్రువ, ఆది, అట తాళాలు)[2] గానము, హస్తాభినయనములలో అర్థాబినయము, వివిధ వీక్షణ విలాస విచిత్ర నటనలలో భావము, చరణ నూపురనాదములో తాళమానము చూపుచు లాస్యమాడెడివారు.[3]

          "నట్టువకాని యందము గాక వింతగా
           కోపులు కల్పించుకొనుచు నాడు" (శుక. 3-14)

       అనియు వర్ణించినాడు. (గాక అనక గాగ అనవలెనేమో!)

యక్షగానాలను గురించి కందుకూరి రుద్రయ్య వ్రాసినసుగ్రీవ విజయమను యక్షగానానికి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఉత్తమ పీఠిక వ్రాసినారు. ఈ క్రింది దానినుండి కొంత యుదాహరింతును.

"తొలుత ద్రావిడభాషలో వెలసిన దృశ్యరచనలు కురవంజు లనబడినవి. కురవజాతివారి అంజె (అడుగు) కురవంజె అనబడును. చిందుగొండ్లి, అంజె ఇత్యాదులు నృత్య విశేషములు. పూర్వము మంగళాద్రి సింహాద్రి మొదలగు పర్వతాలమీద జాతరకాలాలలో అక్కడి యాటవికులు నృత్యములు చేయుచుండువారు. చెంచిక మున్నగునవి కురవంజులుగా వెలసెను. అవి తొలుత

  1. మల్హణ. 40.
  2. వైజయంతి. 1. 123-24.
  3. వైజయంతి. 1-129.