పుట:Andrulasangikach025988mbp.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మద్దెలవాడు, తాళము వేయువాడు, శ్రుతి మేళవించువాడు, వెనుక తోడందుకొని రాగమును సాగదీయువాడు వీరి సమ్మేళనము మేళ మగును. పాతర కత్తెలన నాటకాలలో నాట్యమాడు స్త్రీలు.

           "అధికతరమైన తెరతీసినంతలోన
            బిత్తరము చూపు పాతరకత్తెవోలె"[1]

       అనుటలో నాటక సూచన కలదు.

నృత్యములలో దేశిమార్గ పద్ధతు లుండెను. ఒక వేశ్య నేర్చిన నృత్యము లిట్టివి:-

       'మొగవరి' కట్టడ మొనవుకోలాటంబు చొక్కంపు మురుపులుచిక్కిణీలు
        బరపు బారడు బేసి బహుళరూపుల దగ బంధురగీత ప్రబంధవితతి
        వరుస పద్యము దేశి బంగాళ గీతంబు కొరుతికట్టడ బిందుకొచియకాడు
        పరశురాముడు వీరభద్రుడు కళ్యాణి చౌకట్ల మెకతాళిశబ్దమాది

           దేశిశుద్దాంగములయందు తీగెబోడి
           పటుతరంబుగ నిజపాద కటకయుగళి
           కఖిలపాత్రమ్ములును బొమ్మలగుచు
           వ్రేలపూన్కి వహియింపబొగదౌంచె పుష్పగంది'

పై పద్యములో చాలా పదాలు తెలియవు. కొన్ని అచ్చు తప్పులేమో? తర్వాతి పద్యములో జక్కిణియని యున్నది. చిక్కిణిలకు మారుగా జిక్కిణీలై యుండునేమో?[2] (మొగవర్రి=మొగ్గవాలుట యని యర్థమేమో? తక్కినవాటిలో చాలా పదాల కర్థము తెలియదు.)

          'చారణ బాగడ చర్చరీ బహురూప
              దండసాలాదిక ణాండికములు
           కందుక కోలాటకా సాట్యతాసఖ
              ప్రేరణ కుండలి ప్రేక్షణములు

  1. నిరంకుశ. 2-9.
  2. మల్హణ. పుట 9.