పుట:Andrulasangikach025988mbp.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగరాల దుర్లక్షణాలలో లంచాలు, కూటసాక్ష్యాలు ముఖ్యమైనవి. అవి విజయనగరమందు ప్రబలియుండెను. పైకము తీసుకొని కూటసాక్ష్యాలిచ్చువారు, లంచాలు తీసుకొని అన్యాయపుతీర్పు చెప్పు పెద్దలుండిరి. [1]

వైష్ణవభక్తులు "గర్బమంటపి గడిగిన కలకజలములోని రాతొట్టినిండి కాలువగ జాగి గుడివెడలి వచ్చునది శూద్రు డిడగ గ్రోలి" పోయెడివారు.[2] దీన్నిబట్టి శూద్రవైష్ణవులు కొందరు గుళ్ళలో అర్చకు లనియు, గుళ్ళలో రాతొట్లుండెననియు, మురికినీరే తీర్థమనియు, హరి పాదోదకమనుపేర అ మురికి నీటినే ఆ శూద్రుడు బ్రాహ్మణాదివర్ణముల వారికి తీర్థముగ నిచ్చెననియు తెలియ వచ్చెడి. తీర్థప్రసాదాలకు అంటు ముట్టు దోషములేకుండెను. ఆ యాచారమిప్పుడు పూర్తిగా మృగ్యము. అనాడు వీరశైవమున కెదురొడ్డిన శ్రీవైష్ణవములోను జనాకర్షణము సంస్కార ప్రియత్వముండెను. తర్వాత మరల వాటియవసరము కానరాలేదు.

జనులు భూమిలో పాతిన ధనపుజాడలను పెద్దలు చచ్చువరకు చెప్పక, చచ్చునాడు చెప్పక చచ్చుటచేత, వారి సంతతివారు ధనాంజనాది తంత్రజాలము నెరిగినవారి నాశ్రయించి ధనము నావరించిన భూతాలకు బలినిచ్చి ధనమును తీసుకొనెడివారు. భూతాలకు నెత్తుటి కూటిని తూరుపుతట్టు బలిగాపెట్టి ధనమును త్రవ్వి తీసుకొనెడివారు.[3]

పెండ్లిండ్లలో నేటికాలములో వలెనే బంధుమిత్రులు చీరలు, వస్త్రములు, భూషణములు మున్నగునవి చదివించెడువారు.[4] అల్లుం డకు మామలు విలువగు వస్త్రభూషణములను చదివించిరి.[5] ధనికులగు తల్లిదండ్రులు తమ కూతుండ్ర కరణముగా మంచములు, పరుపులు, పళ్లెములు, పీటలు, ఉయ్యెలమంచములు, తమ్మవడిగములు, బిందెలు, కొప్పెరలు, వక్కలాకుల పెట్టెలు, రత్నమౌక్తిక స్వర్ణభూషణములు, పట్టుబట్టలు, అగరు, కస్తూరి, జవ్వాజి, కుంకుమపువ్వు,

  1. నీతి సీసపద్యశతకము-తాళ్ళపాక.
  2. ఆము. 6-8.
  3. మను. 3-21.
  4. మను. 5-86-97.
  5. మనుచరిత్ర 5-97