పుట:Andrulasangikach025988mbp.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గంధము, పచ్చకర్పూరము, పన్నీరు, పునుగు, అత్తరు మున్నగువాని నిస్తూ వుండిరి. కూతుండ్ర సేవలో నుండుటకు దాసీలను (ఆడపాపలను) కూడా ఇచ్చి పంపెడివారు.[1]

జనులు సాధారణజాడ్యాలకు చికిత్సలు కొంతవరకు తెలిసియుండిరి. నిన్న మొన్నటివరకు ప్రతి గ్రామములో కొందరు ముసలమ్మలు వాము, మిరియాలు, దుంపరాష్ట్రము, పిప్పళ్లు, సొంఠి మున్నగునవి మందుల మూటగా కట్టి యుంచుకొనెడివారు. తులసిచెట్లు చాలాయిండ్లలో నుండెడివి. వాటి రసము జ్వరాల కిచ్చెడువారు. ఇంకా కొంత తెలిసినవారు దుప్పికొమ్ము, గోరోజనము, కస్తూరి, కుంకుమ పువ్వు, వైష్ణవి, భైరవి మాత్రలు ఉంచుకొనెడివారు. గడ్డలకు గోధుమపిండి యుడికించి కట్టిరి. నెత్తి నొప్పులకు గులకరాళ్ళ ఆవిరి యిచ్చిరి. నొప్పులకు వేపాకు మున్నగునవి కాచి కాక వేసెడివారు. నేత్రరోగాలకు ఆకాలమందు చేసిన చికిత్స యిట్లుండెను.

         "కోక పొట్లం బావిగొన నూది యొత్తుచు
             కషణోష్ణకరభభాగమున గాచి
          నెత్తి తంగేడాకు మెత్తి రేచకినిమ్మ
             పంటిపుల్సున నూరి పట్టు వెట్టి
          తెల్ల దింటెనపువ్వు దెచ్చి తద్రస మిడి
             జలివెపువ్వులు గోసి నిలిచి విడిచి
          పేరననెయి వెట్టి పెరుగువత్తులువైచి
             చనుబాలతో రాచి సంకు చమిరి" [2]

నానావిధ చికిత్సలు చేసిరి. దెబ్బలు తగిలినప్పు డీ క్రింది చికిత్సలు చేసిరి:-

         "కొంగవాల్నరకు లంగుళుల బట్టుచు జబ్బ లంట గుట్టిడ వెజ్జునరయు
          వారు తలబడ్డ గుదియ ప్రప్పుల బ్రాతమసి యిది" [3]

  1. మనుచరిత్ర 5-101.
  2. శ్రీ కాళహస్తి మాహాత్మ్యము, 3-వ ఆశ్వాసము 110.
  3. ఆముక్తమాల్యద 7-20.