పుట:Andrulasangikach025988mbp.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేదరివాని వేషమును కవి యిట్లు వర్ణించెను:-

         "మలయంగ నెడదుంటి మైనోరగాగ
             మొలత్రాటి జెక్కిన మోటకట్టియును
          కొనసిగతోగూడి కురులొక యింత
             గనుపట్ట జెరివిన గన్నెరాకమ్ము
          గొనల వెల్వడు పుట్టగోచియు నెరులు
             బెనగొన్న నునుదబ్బపీను డా కేల
          వెడవెడజివ్వాడు వెదురుసలాక
             యెడమచేబొటవ్రేలి యినుపయుంగరము
          .... .... .... ....అవ్వనభూమి కేతెంచె"[1]

(గన్నెరాకమ్ము=గన్నే రాకువంటి అలుగులుకల అమ్ము) జివ్వాడు తప్పు. జవ్వాడు అనవలెను. మేదరవారు తెనుగువారు కారు, వారు అరవలుగా గనుపింతురు. రాయలకాలమునాడే వారిభాష వేరుగా నుండెను. అడవిలో ఒక బాలుని ఆక్రందనమును మేదవారు విని,

      "ఆలించి మార్జాలమని సంశయించి పాక్క పాక్కని తమభాష జెప్పుచును"[2]

అనుటచే వారిభాష వేరనుట స్పష్టము. తెలుగుదేశమందలి మేదరవారు తెనుగు భాషనే మాట్లాడుదురు. కాని బొంగు, ఈతబరిగెలతో బుట్టలల్లు ఎరుకలవారు మాత్రము చెడిన అరవమును మాట్లాడుదురు. పాక్కఅన పిల్లి అను నర్థమిచ్చు కన్నడ పదముకాని, తమిళ పదముకాని లేదని తెలిసినది. మరే భాషలో నున్నదో యేమో? మేదర వారిని సంస్కృతములో వేణులావకులు, కటకారుల అనిరి. వారు వెదురుచాపలు, బుట్టలు, తడకలు, మంచములు, గుమ్ములు మున్నగునవి చేసి జీవింతురు. మనలో వీరు కాకతీయుల కాలానికి పూర్వమునుండియే జీవించినను వీరినిగురించి తెలుసుకొన్న వారు లేరు.

కానెవారు (ఇండ్లు కట్టువారు) ఎట్టివారనగా:-

      "కలయ నాచార్యుల కాసీల నపుడు పిలిపింప వారలు పెనిజనిన్నిదములు
       చంకల శిల్పశాస్త్రపుస్తకములు వంకవో జుట్టిన వలుదపాగలును[3]

  1. ప. యో. విలాసము, పు 508.
  2. ప. యో. విలాసము, పు 65.
  3. ప. యో. విలాసము, పు 66.