పుట:Andrulasangikach025988mbp.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైద్యుల వేష మెట్టిదనగా:-

           "చంక మందులసంచి జగజంపు వలువ
               పొంకమై నిజకర్ణముల నొప్పు దూది
            కునివడ జుట్టిన కురుమాపు పాగ
               అనువంద పంచలోహంపుటుంగరము
            ఉరుతరంబైనట్టియూర్ధ్వపుండ్రంబు
               కరమొప్పు వలకేలి కరకకాయలును
            బెరయ పచ్చడముతో పెనుపడ సంది
               నర గనుపట్టు బాహాట పుస్తకము
            బనుపడలో గుణపాఠంబుచదివికొనుచు
               మూలికలుదిక్కులు చూచికొనుచు
            అన్నగరవ నుండు నత డేగుడెంచె"[1]

(జగజము-శ. ర. లో లేదు.) బాహాటము అన బయలు పడినది, వెంటనే, అరగనుపట్టు అనుటచే బాహాటమున కీయర్థము సరిపడదు, "బాహాటము" అను వైద్యగ్రంథము కలదు. దాని కెక్కువ ప్రామాణ్య మానాటి వైద్యులలో కలదేమో? బాహాటమని కవి యేల వాడెనో?

(విజయనగరమున ఆయుర్వేద కళాశాల లుండెను. అందు అరబ్బులు ఈరానీ విద్యార్థులుకూడా వైవిద్య నభ్యసించిరి. అరబ్బు యువకులు ఈ దేశమున ఆయుర్వేదము కొంతకాల మభ్యసించనిది తమ విద్య పూర్తి కాదని తలచిరని ప్లూజెల్ అను యూరోపువాడు వ్రాసెను. విజయనగరములో వైద్యకళాశాల లుండెననియు అందు అరబ్బు విద్యార్థులు చదువు తుండిరని సులేమాన్ అను అరబ్బు వ్యాపారి వ్రాసెను.

వైష్ణవ భాగవతుడు
-

        "వదలుపింజల నిడు వాలుదోవతియు పోలగా జుట్టిల పొత్తిపొగయును
         దూలగట్టిన వెడతోపు పచ్చడము అంకే డాకేలి పంచాంగంబు ముష్టి
         చంకవ్రేలెడు తాళి చలిదిమూటయును"[2]
         కలిగి ప్రయాణము సాగించెను.

  1. ప. యో. విలాసము. పు. 450.
  2. ప. యో. విలాసము. పు. 508.