పుట:Andrulasangikach025988mbp.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురభి ధూపంబును" వెంట్రుకలకు వేసిరి.[1] స్త్రీలు కాలి వ్రేళ్లకు లత్తుక రంగును పూసుకొంటూ వుండిరి.[2]

ధనికుల యాహార మెట్టిదో తెలుసుకొందుము.

        "తారుణ్యాతిగ చూత నూత్న ఫలయుక్తైలాభిఘారస్వస
         ద్ధారాధూపిత శుష్యదంబు హృతమా త్స్యచ్ఛేద పాకోద్గతో
         ద్గారంపుం గనూర్చు భోగులకు సంధ్యావేళన్ గేళికాం
         తరాభ్యంతరవాలుకాస్థిత హిమాంత ర్నారికేళాంబుపుల్.[3]

భోగులును, మాంసభుక్తులును నగువారు ఎండకాలములో చేప తునకలలో మామిడికాయ ముక్కలు వేసి తాళింపుచేసి, మధ్యాహ్నమందు భుజించి, సాయంకాలమందు తడిపిన ఇసుకలో పూన్చిన టెంకాయలను తీసి ఎడనీరుత్రాగి, చేతల కనరును పోగొట్టుచుండిరి. ఇది శ్రీకృష్ణదేవరాయలు స్వయముగా ననుభవించినదై యుండును. బ్రాహ్మణుల వైభవముల కేమియు కొదువ లేకుండెను. వేసవిలో అరటిపండ్లు, పనసతొనలు, నేతిముద్దలవంటి దోసబద్దలు, మంచి జాతుల మామిడిపండ్లు, ద్రాక్షపండ్లు, వడపప్పు, తియ్యదానిమ్మలు, రసదాడి అను అరటిపండ్లు, పానకము మున్నగునవి సాపడుతూ వుండిరి.[4] అలర్కమును ముండ్ల యుచ్చింత కూర యని వేదము వే. రా. శాస్త్రిగారు వ్రాసిరి. దానిపై యామునాచార్యులకు ప్రీతి మెండుగా నుండెను.[5] అది మేదోవృద్ధిని కలిగించెడి కూరయట! కాని యిదే యామునాచార్య కథను వ్రాసిన పరమయోగి విలాసములో ఈ కూరను 'ముండ్ల ములిచింతకూర' అని వ్రాసినారు.[6]

రాజులకు, రాజబంధువులకు వేటపై ఆసక్తి యుండెను. చిరుత పులులను పొంచి వాటిని వదలి జింకలను వేటాడెడివారు.[7] వర్షము బాగా కురిసిననాడు

  1. రాధామాధవము, 4 - 163.
  2. రాధామాధవము, 4 - 168.
  3. ఆముక్తమాల్యద, 2 - 68.
  4. ఆముక్తమాల్య్దద, 273.
  5. ఆముక్తమాల్యద 4 - 195.
  6. పరమయోగి విలాసము ద్విపద. పు 581.
  7. ఆముక్తమాల్యద 4 - 193.