పుట:Andrulasangikach025988mbp.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ధనికుల యిండ్ల కేగి, ప్రియములు పలికి, సేవచేసి, నమ్మికపుట్టించి, మనసులు కరిగించి, మాయసొమ్ములు, లక్కపొదుపులు, మాయబంగారు, బంగారునీ రెక్కించిన ఇత్తడి, ఇనుప సొమ్ములు మాయమణులు, గుప్తముగా రాతి తీసుకొనిపోయి, ఇవి దాచుడని లక్కముద్రలు వేయించి, లండుబోతుల పూటగా బెట్టి, అప్పులు గొని, యెగబెట్టి, పట్టుబడి, రచ్చకీడ్వబడి, వారిచ్చు శిక్ష లనుభవించి, రాళ్ళుమోసి, దెబ్బలు తినియైనను మందిని ముంచవలెనట !" (హరిశ్చంద్ర ఉత్తరభాగము, పుట 151-152)

రెడ్డిరాజులు ఆంధ్రదేశమందు అనేక శివాలయములను కట్టించి తమకన్న పూర్వమం దుండిన ప్రసిద్ధాలయములకు దానము లిచ్చుటయేకాక ద్రావిడదేశమందును ఉత్తర హిందూస్థాన మందును కల ప్రసిద్ధ శివక్షేత్రములకు దానధర్మములు చేసిరి.

రెడ్డిరాజుల కించుమించు మూడునూర్ల యేండ్లకుముందు హేమాద్రియను నతడు ఆచార వ్యవహారాదులను గురించి యొక విపుల మగు శాస్త్రమును వ్రాసి పెట్టెను. దానికి చెలామణియగుచూ వచ్చెను. రెడ్డిరాజులు హేమాద్రి ప్రోక్తవిధానములతో షోడశ దానాలు చేసిరని సమకాలీన ప్రామాణిక కవులు వర్ణించిరి. అ దానాలు సామాన్యమైన తిరిపెమలు కావు. అవి కొంపలు తీసే త్యాగాలు. అగ్రహారా లను పేర అనేక గ్రామాలను, భూదానములను, గోహిరణ్య రత్నాదులను, నానా విధములగు ఇతర దానములను చేసి యుండిరి. అనగా తమ ఆదాయములను కోరుపంచి యిచ్చిరన్నమాట. హేమాద్రి ప్రభావ మట్టిది.

తెనుగువారికి ధర్మశాస్త్రాలన్నిటిపైకి, యాజ్ఞవల్క్య స్మృతిపై రెడ్డిరాజులకు ఇన్నూరేండ్లకు పూర్వము వ్రాసిన విజ్ఞానేశ్వరీ వ్యాఖ్యయే ప్రధానమైనదయ్యెను. ఆకారణముచేత రెడ్డిరాజుల కాలమువాడగు కేతన విజ్ఞానేశ్వరీయమును తెనుగు పద్యములలో వ్రాసెను.

వ్యవసాయము - ప్రజలస్థితి

రెడ్డిరాజుల కాలములో దేశమును సీమలనుగా లేక నాడులనుగా విభజించినట్లు కానవచ్చును. ఈ విభజన వారు క్రొత్తగా చేసినట్లు కానరాదు. వారికంటే