పుట:Andrulasangikach025988mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శకునాలనుగూర్చి క్రీడాభిరామమం దిట్లు తడవినారు.

         "చుక్కయొకింతనిక్కి బలసూదము దిక్కున రాయుచుండుటన్
          జక్కగ వేగదిప్పుడు నిశాసమయంబిది ప్రస్ఫుటంబుగా
          ఘుక్కని మాటిమాటికిని గోటడు పల్కెడు వామదిక్కునన్
          జొక్కటమై ఫలించు మన శోభనకార్యములెల్ల టిట్టిభా.

          మాగిలి మాగిలి వృక్షము
          పూగొమ్ము ననుండి షడ్జము ప్రకాశింపన్
          లేగొదమ నెమలిపల్కెడు
          గేగోయని వైశ్యమనకు గెలుపగు జుమ్మా
          కొనకొనం గోడియేట్రింత కొంకనక్క
          నమలి యీనాలుగిటి దర్శనంబు లెస్స
          వీని వలతీరు బలుకు నుర్వీజనులకు
          కొంగుబంగారమండ్రు శాకునికవరులు.

"గోధూళి లగ్నంబు నంబురంబు ప్రవేశింపవలయు. విశేషించి యుష:కాలంబు సర్వప్రయోజనారంభములకు బ్రశస్తంబు"

         "గార్గ్య సిద్ధాంతమత ముష:కాలకలన
          శకున మూమట యది బృహస్పతిమతంబు
          విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము
          సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మతమగు."

ఇట్టి పద్యమే క్రీడాభిరామమందును గలదు.

"వ్యాసమతము మన: ప్రసాదాతిశయము"

అనుటకు మారుగా శ్రీనాథుడు తన భీమఖండమం దిట్లు వేరుగా వ్రాసెను.

"సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మతమగు"[1]
(తక్కిన మూడు పఙ్త్కులు సమానమే)

  1. భీమేశ్వరపురాణము, అ 3, ప 41.