పుట:Andhrulacharitramu-part3.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుడు కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదమును వహించినవాడుగా నాతనిచే స్థాపితములైన శాసనములలో బేర్కొనబడియున్నను నిజముగా నితడు కాకతీయరాజ్యవిధ్వంసకు డని చెప్పవలయునే కాని కాకతీయరాజ్యస్థాపనాచార్యు డని చెప్పరాదు. ఇతనిపూర్వులు వహించినయా బిరుదము గౌరవార్థ మీతనిబిరుదావళిలో జేర్పబడినది కాని మఱియొండు గాదు. కాకతీయులరాజ్య మీత డాక్రమించుటచేతనే రాచవారు మొదలగువారు ప్రబలవైరులైరి. పంచపాండ్యదళవిఫాలు డను బిరుదము కూడ పూర్వులవలననే సంక్రమించినదికాని పంచపాండ్యులదళమును జయించుటచేత నితనికి లభించినబిరుదము కాదు. మఱియు నితనికిం గల బిరుదములలో బెక్కులు పూర్వులు వహించినవియు మఱియు గొన్ని కాకతీయులును రెడ్డిరాజులును వహించినవియు నై యున్నవి.*

[1]

.

  1. * స్వస్తిశ్రీ మన్మహామండలేశ్వర రేచెర్లగోత్రచింతామణి గజదళవిఫాళ భుజబల భీమఖడ్గ నారాయణ చేకోలుగండ గాయగోపాళ పాండ్య రాజగజదళనిఫాళ చలమర్తిగండ ధరణివరాహ దుష్ట రాజగజాంకుశ ప్రతికూలరాయ భయంకర ప్రతిగండభైరవ రాయమీనజాల రాయదేవేంద్రవల్లభ జాణరాయ కులగురు సమరమహేశ్వర ఇనుమర్తిగండగోపాళ కేళాదిరాయ జగనొబ్బ