పుట:Andhrulacharitramu-part3.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కితమైన మాధవపురమందు ప్రాజ్యరాజ్యోపవిష్టుం డై" అని వ్రాయబడియున్నంత మాత్రముచేత నితడు స్వతంత్రుడై అనపోతభూపాలునితో సంబంధము లే కుండ ప్రత్యేకాంధ్ర భూభాగమును బరిపాలించుచున్నవా డని మనమూహింప రాదు. ఇతడు తనయన్నతోగూడ జల్లిపల్లిరణములో శత్రు రాజులను సంహరించి పితృవాక్యపరిపాలనము చేసినవా డగుటచేత నీతనికి గూడ సోమకులపరశురాము డను బిరుదము లభించిన ట్లీతనిచే స్థాపితమైన శాసనములో నుదాహరింప బడినబిరుదముచేతనే విస్పష్ట మగుచున్నది.* [1] అనపోతభూపా

  1. *" శ్రీగణపతియేనమ: స్వస్తిశ్రీమన్మహామండలేశ్వరరాయ గాయగోపాళ గజదళ నిఫాళ భుజబలభీమ ఖడ్గనారాయణ సోమకులపరశురామ సత్యహరిశ్చంద్ర శౌచగాంగేయ అప్రతిహతప్రతాపోదయ సతతహే హిద్రిదాననిరత దాచయ సింగభూపతిసుతుండైన మేదినీరూప నారాయణ జగమాంభాగర్భోదయ రేచెర్లవంశదుగ్ధాబ్ధి సుధాకరుం డైనశ్రీమాధవేంద్రుడు దేవనగ దక్షిణప్రాంతమందుల స్వ నామాంకితమైన మాధవ ---- సామ్రాజ్యరాజ్యోపవిష్టుండై శ్రీపర్వతోత్తర ద్వారమైన మహేంద్ర---దేవరమంటపము మహచ్ఛిలాసమూహానను రమ్యముగా రచియించి పదవాక్యప్రమాణజ్ఞులైన మాయిభట్టో పాధ్యాయులను తనీమిత్తంబై శాసనము చెప్పమని చెప్పుమని చెప్పమని పనిచిన పిదప దనుత్త శాసనంబు." ఇంతవఱకును దెలుగు తరువాత సంస్కృత శ్లోకములుగలవు. నైజామురాజ్యములో మహబూబునగరముజిల్లా అమరవాదితాలూకాలో జేరి శ్రీశైలోత్తర ద్వారమైన ఉమామహేశ్వరములో దేవస్థాన సమీపమున నున్నది. (వెలుగోటివారి వంశచరిత్రము. అనుబంధము 310 పేజి. 10 వ సంఖ్యగల శిలాశాసనము చూడుడు.)