పుట:Andhrulacharitramu-part3.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సింగభూపాలుడు కృష్ణానదీతీరమున సిద్ధ క్షేత్రముగా నున్న యేలేశ్వరములో ననేక బ్రహ్మప్రతిష్ఠలు గావించెననియు, మఱియు ననేక దానములు గావించెననియు, సింగభూపాలీయములో వర్ణింపబడి యుండెను [1].

సింగమనాయని సోదరుల ప్రతాపము

సింగమనాయని సోదరులైన వెన్నమనాయడును, యాచమనాయడును మత్స్యగన్న రాజు మొదలగు రాజులను జయించి కొలమ చెలమ గ్రామములో నున్నమన్నెవారిపై దక్కనులోని తురకలు దండెత్తి రాగా మన్నెవారు సాహాయ్యముకోరి ప్రార్థించినందున వీరు తురకలపై యుద్ధమునకు వెడలిరి. యాచమనాయడు తురకల నోడించి మన్నెవారిని కాపాడి వీరగురు అను బిరుదము గాంచెనట. ఈ యుద్ధమున బేర్కొనకపోయినను వీరగురు బిరుదమున్నట్లు సింగభూపాలీయమున నుదాహరింపబడియున్నది. ఈ యాచమనానికి నాగానాయడను పుత్త్రుడు గలడనియు, అతడు దణ్ణాలకోట (ధరణికోట) యొద్దను అనవేమారెడ్డితో గఠారి

  1. శ్లో. కృష్ణైలేశ్వర సన్నిధౌ కృతమహాసంభార మేలేశ్వరే
    వీతాపాయ మనేకశో విదధతా బ్రహ్మప్రతిష్ఠాపనమ్
    అనృణ్యం సమపాది యేన విభునా తత్తద్గుణై రాత్మనో
    నిర్మాణాతిశయ ప్రయాస గరిమవ్యాసజ్ఞిని బ్రహ్మణి.